Advertisement

Advertisement


Home > Movies - Movie News

సింహం లాంటి సామాన్యుడు

సింహం లాంటి సామాన్యుడు

హీరో విశాల్ సినిమాలు అంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్  తో నిండి వుంటాయి. అలాంటి సినిమా మరోటి వస్తోంది. సామాన్యుడు టైటిల్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలోకే దిగాల్సి వుంది. కానీ థియేటర్లు లేక ఆగింది. ఇప్పుడు ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు.

దుర్మార్గుడు చిన్న చిన్న వాళ్లను చంపేయచ్చు. బాదపెట్టొచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు వాడికి సింహం లాంటి వాడు తగుల్తాడు. అప్పుడు దాన్ని మాత్రం చంపలేడు. 

ఇదే కాన్సెప్ట్ తో సామాన్యుడు సినిమా ను తయారు చేస్తున్నారు. గాయపడి, తిరగబడిన సామాన్యుడిగా విశాల్ కనిపిస్తున్నాడు. ట్రయిలర్ మొత్తం యాక్షన్ సీన్లతోనే నింపేసారు. 

ఆఫ్ కోర్స్ మచ్చుకు ఓ రొమాంటిక్ సీన్ యాడ్ చేసారు అనుకోండి. దాన్ని తప్పిస్తే ట్రయిలర్  అంతా భారీ పోరాట దృశ్యాలే. అయితే రీపిట్ సీన్ల మాదిరిగా కాకుండా కాస్త క్వాలిటీగా వున్నాయి యాక్షన్ సీన్లు. ఈ సినిమా విడుదల డేట్ ను త్వరలో ప్రకటిస్తారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?