cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పోలీసుల‌పై 'సింగం' సినిమాలు త‌ప్పైంద‌న్న డైరెక్ట‌ర్!

పోలీసుల‌పై 'సింగం' సినిమాలు త‌ప్పైంద‌న్న డైరెక్ట‌ర్!

త‌మిళ‌నాట పోలీసుల క‌స్ట‌డీలో తండ్రీకొడుకులు మ‌ర‌ణించిన వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది. తూత్తుకొడి జిల్లాలో స‌తాన్కులం టౌన్లో జ‌య‌రాజ్, ఫెనిక్స్ అనే తండ్రీ కొడుకులు పోలీసులు క‌స్ట‌డీలో అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. ఈ విష‌యంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పోలీసుల తీరుపై అనేక మంది విరుచుకుప‌డుతూ ఉన్నారు. సినీ సెల‌బ్రిటీలు కూడా ఈ అంశంపై స్పందించారు. 

అలాగే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా ఈ ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేసింది. విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టుగా ఉంది. అలాగే మృతుల కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించిన‌ట్టుగా కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.  అకార‌ణంగా ఇలా మ‌నుషుల‌ను చంపి, ప‌రిహారాల‌ను ప్ర‌క‌టిస్తే ఏమొస్తుంద‌నే విమ‌ర్శ‌లు కొన‌సాగుతూ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అనేక మంది ప్ర‌ముఖులు ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. 

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, న‌టి-రాజ‌కీయ నేత కుష్భూతో స‌హా అనేక మంది ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. సినీ ద‌ర్శ‌కుడు హ‌రి కూడా ఈ ఘ‌ట‌న విష‌యంలో స్పందించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మిళంలో పోలీసుల‌ను బాగా హైలెట్ చేస్తూ సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడు హ‌రి. సామి, సింగం సీరిస్ లో మూడు సినిమాలు, స్వామీ స్క్వైర్ అంటూ ఇంకో సినిమా.. వీట‌న్నింటిలోనూ పోలీసుల‌ను ఈ రేంజ్ హీరోలుగా ఈ ద‌ర్శ‌కుడు చూపారో తెలుగు ప్రేక్ష‌కులకూ తెలిసిన సంగ‌తే. ఈ నేప‌థ్యంలో హ‌రి స్పందించార‌ట‌. త‌మిళ‌నాడు పోలీసుల దురాగ‌తం నేప‌థ్యంలో.. పోలీసుల‌ను  ఆ స్థాయి హీరోలుగా చూపినందుకు ఒక ర‌కమైన విచారం వ్య‌క్తం చేస్తున్నాడు ఆ ద‌ర్శ‌కుడు. పోలీసులు మ‌రీ అంత గొప్ప వాళ్లు కాద‌ని ఇప్పుడు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నాడు ఆ ద‌ర్శ‌కుడు.

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు