Advertisement

Advertisement


Home > Movies - Movie News

బిగ్‌బాస్ బ్యూటీకి కోవిడ్‌

బిగ్‌బాస్ బ్యూటీకి కోవిడ్‌

బిగ్‌బాస్ సీజ‌న్‌-5 బ్యూటీ సిరి హ‌న్మంతు క‌రోనా బారిన ప‌డ్డారు. గ‌డిచిన తాజా బిగ్‌బాస్ రియాల్టీ షోలో సిరి టాప్‌-5లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్‌లో యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌తో సిరి సాన్నిహిత్యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హ‌గ్గులు, కిస్‌ల‌తో షోను రంజింప చేశారు. అలాగే ష‌ణ్ముక్‌తో దీప్తి సున‌య‌న బ్రేక‌ప్‌న‌కు సిరినే కార‌ణ‌మ‌నే చ‌ర్చ కూడా లేక‌పోలేదు. దీన్ని ఆమె ఖండించారు.

తాజాగా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యిన‌ట్టు సిరి త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్న‌ట్టు తేలింద‌ని పేర్కొన్నారు. త‌న బాయ్‌ఫ్రెండ్‌తో సిరికి నిశ్చితార్థం కూడా జ‌రిగింది. రియాల్టీ షోకు వెళ్ల‌క‌ముందే ఈ తంతు జ‌రిగింది. హౌస్ నుంచి బ‌య‌టికొచ్చిన త‌ర్వాత త‌న‌పై సాగిన నెగెటివ్ ట్రోలింగ్‌తో సిరి షాక్‌కు గుర‌య్యారు.

త‌న మ‌న‌సు కంట్రోల్ త‌ప్పుతోంద‌ని, ఎవ‌రేమ‌నుకున్నా ఈ వాస్త‌వాన్ని బ‌హిరంగంగా చెబుతున్న‌ట్టు హౌస్‌లో సిరి చేసిన ప్ర‌క‌ట‌న ఆమెకు నెగెటివిటీ బాగా పెంచింది. 

మ‌రీ ముఖ్యంగా హౌస్‌కు వెళ్లిన త‌ల్లి కౌగిలింత‌లు, ముద్దుల‌పై హెచ్చ‌రించినా సిరి ప‌ట్టించుకోక పోవ‌డం కూడా ఆమెపై నెగెటివ్ ప్ర‌భావం ప‌డ‌డానికి కార‌ణ‌మైంది. ప్ర‌స్తుతం ఆమె క‌రోనా పాజిటివ్ బారిన ప‌డ‌డం విశేషం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?