Advertisement

Advertisement


Home > Movies - Movie News

ముదురు హీరోల రొమాన్స్.. హీరోయిన్ హాట్ కామెంట్!

ముదురు హీరోల రొమాన్స్.. హీరోయిన్ హాట్ కామెంట్!

'నాకు 55 యేళ్ల వయసు వచ్చాకా.. సినిమాల్లో ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో రొమాన్స్ చేయను...' అని అంటోంది సోనాక్షి సిన్హా! ఈ మాట ఎవరికి తగలాలో వారికి తగులుతూ ఉంది. బాలీవుడ్ లో అయినా.. టాలీవుడ్ లో అయినా..యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యాభై, అరవై సంవత్సరాల వయసు హీరోలు కూడా  కుర్ర భామలతో తెర మీద రొమాన్స్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు.

సౌత్ లో అయినా నార్త్ లో అయినా అదే పరిస్థితి. చాలా మంది హీరోల వయసు యాభై దాటింది! అరవై దాటాకా కూడా ఇంకా కొంతమంది హీరోలు తెర మీద వలపు బాణాలు వేస్తూ ఉన్నారు. ఆ సీన్లే ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. అయినా వారు మొహమాట పడటం లేదు. షష్టిపూర్తి చేసుకుని ఐదారేళ్ల తర్వాత కూడా ఇంకా తొలి ప్రేమ సన్నివేశాల్లో నటిస్తూ నవ్వుల పాలవుతున్నారు నటులు.

ఇలాంటి క్రమంలో సోనాక్షి సిన్హా ఆ హాట్ కామెంట్ చేసింది. తనకే గనుక యాభై ఐదేళ్లు వచ్చాకా సినిమాల్లో నటించే అవకాశం ఉంటే, అప్పుడు ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో తెరపై రొమాంటిక్ సీన్లలో నటించనని వ్యంగ్యంగా చెప్పింది సోనాక్షి. యాభై ఐదేళ్ల హీరోలు, ఇరవై రెండేళ్ల అమ్మాయిలకు జతగా నటిస్తుండటాన్ని సోనాక్షి ఇలా ప్రస్తావించింది. తమ కూతురు వయసున్న అమ్మాయిలతో రొమాన్స్ చేసే హీరోలపై సోనాక్షి ఇలా పంచ్ విసిరింది! ఎంతైనా షాట్ గన్ కూతురు కదా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?