Advertisement

Advertisement


Home > Movies - Movie News

సోనూ సూద్ మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసా?

సోనూ సూద్ మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసా?

ప్రస్తుతం ఇండియాలోనే టాప్ సెలబ్రిటీల్లో ఒకడు సోనూ సూద్. కేవలం సినిమాలతోనే కాదు, కరోనా/లాక్ డౌన్ టైమ్ లో చేసిన సేవా కార్యక్రమాలతో స్టార్ అయిపోయాడు సోనూ. చాలామంది దృష్టిలో అతడు మనిషి రూపంలో ఉన్న దేవుడు. ఇలాంటి వ్యక్తిపై ఐటీ దాడులు జరిగాయి. సోనూ పన్ను ఎగవేశాడంటూ ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఇంతకీ సోనూ సూద్ ఆస్తి విలువ ఎంత?

సోనూ దగ్గర ఎంత డబ్బు ఉంది?

దాదాపు 21 ఏళ్లుగా నటజీవితంలో ఉన్నాడు సోనూ సూద్. ప్రస్తుతం ఈ నటుడు ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నాడనే టాక్ ఉంది. దీనికితోడు కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఇలా అన్నీ కలుపుకొని సోనూ సూద్ నికర ఆస్తుల విలువ దాదాపు 130.339 కోట్ల రూపాయలు. 

సోనూ లగ్జరీ లైఫ్

ప్రస్తుతం తన దగ్గర ఉన్న డబ్బుతో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు సోనూ సూద్. ఇతడి దగ్గర 2 కోట్ల రూపాయల ఖరీదైన పోర్సే పనెమెరా కారు ఉంది. దీంతో పాటు ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారు కూడా ఉంది. మంబయి అంథేరీలో 2600 చదరపు అడుగుల్లో 4 బెడ్ రూమ్స్ తో ఉన్న ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది. ఇది కాకుండా తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని 20 కోట్ల రూపాయలతో ఆధునీకరించాడు సోనూ.

కేవలం యాక్టింగ్, యాడ్స్ మాత్రమే కాకుండా.. సోనూ సూద్ కు సొంత ప్రొడక్షన్ హౌజ్ కూడా ఉంది. 2016లోనే శక్తిసాగర్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటుచేశాడు. అందులో దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టాడు.

అప్ కమింగ్ ప్రాజెక్టులు

ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో టాప్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు సోనూ సూద్. అతడు నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమైంది. హిందీ, తమిళ్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటికి తోడు లాక్ డౌన్ లో వచ్చిన స్టార్ స్టేటస్ తో హీరోగా కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు సోనూ.

సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నాడు?

ఎప్పుడైతే తొలిసారి దేశంలో లాక్ డౌన్ పడిందో అప్పట్నుంచి తన సేవా కార్యక్రమాల్ని ముమ్మరం చేశాడు సోనూ సూద్. ప్రతి రోజూ వేల మందికి భోజనాలు పెట్టాడు. లక్షల మందిని తన ఖర్చుతో సొంత ఊళ్లకు పంపించాడు. ఆ తర్వాత కూడా తన సహాయ కార్యక్రమాల్ని విస్తరించాడు. వేల మందికి ఆపరేషన్లు చేయించాడు. ఎంతోమందికి ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. చదవుకునే విద్యార్థులకు ల్యాప్ టాప్స్ సమకూరుస్తున్నాడు. లక్షలాది మందికి కాలేజీ ఫీజులు కడుతున్నాడు.

ఇవన్నీ తన సొంత ఖర్చుతో చేయడం లేదని, కోట్లలో విరాళాలు తనకు వస్తున్నాయని సోనూ సూద్ గతంలోనే ప్రకటించాడు. తాజాగా ఆదాయపు పన్నుశాఖ కూడా నిర్వహించిన దాడుల్లో.. సోనూ ఛారిటీ ఖాతాల్లో 18 కోట్ల రూపాయల వరకు డబ్బు ఉన్నట్టు గుర్తించింది. తన ఖాతాలో ఉన్న ప్రతి రూపాయిని పేదల జీవితాలు కాపాడేందుకు వెచ్చిస్తానని తాజాగా ట్వీట్ చేశాడు సోనూ. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?