స్పెషల్ న్యూస్ – గూఢచారిగా అఖిల్

అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తోనే కనిపిస్తూ వస్తున్నాడు. తొలిసినిమా లో యాక్షన్ పార్ట్ వున్నా కూడా లవ్,రొమాంటిక్ టచ్ మిస్ కాకుండా చూసుకున్నాడు. ఆ తరువాత హలో, మజ్ఞు…

అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తోనే కనిపిస్తూ వస్తున్నాడు. తొలిసినిమా లో యాక్షన్ పార్ట్ వున్నా కూడా లవ్,రొమాంటిక్ టచ్ మిస్ కాకుండా చూసుకున్నాడు. ఆ తరువాత హలో, మజ్ఞు ఇవన్నీ కూడా లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ నే. లేటెస్ట్ గా చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సంగతి ఇక టైటిల్ నే చెబుతోంది. అయితే రాబోయే డైరక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా మాత్రం పూర్తిగా డిఫరెంట్ అంట.

అవును…వినిపిస్తున్న వార్తలు నిజమైతే, అఖిల్ అక్కినేని ఓ స్పై థ్రిల్లర్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో స్పై గా కనిపించబోతున్నాడు. మాంచి ఇంట్రస్టింగ్ స్పై థ్రిల్లర్ సబ్జెక్ట్ ను అఖిల్ కోసం సురేందర్ రెడ్డి రెడీ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇదే సబ్జెక్ట్ ను రామ్ కూడా చెప్పాడు. అయితే రామ్ ఎందుకో స్పై థ్రిల్లర్ లో మాస్ టచ్  వుండదని వదిలేసినట్లు తెలుస్తోంది.

అఖిల్ లుక్ కు, గెటప్ కు స్పై థ్రిల్లర్ కచ్చితంగా సూటవుతుందనే అనుకోవాలి. పైగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు కచ్చితంగా ఈసినిమా ఆ చాన్స్ ఇఛ్చే అవకాశం వుంది.

జగన్ ని చూసి నేర్చుకో

ఉద్యాన ఉత్పత్తులతో ‘కిసాన్‌ రైలు’