cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఫ్లాప్ సినిమాతో రికార్డు సృష్టిస్తున్న మహేష్

ఫ్లాప్ సినిమాతో రికార్డు సృష్టిస్తున్న మహేష్

మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి స్పైడర్ సినిమా. ఈ సినిమా కొన్న ఏ ఒక్క బయ్యర్ కోలుకోలేదు. అలాంటి డిజాస్టర్ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్పైడర్ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. 

అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి ఎన్నో వేదికలపై ఎన్నో తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇందులో విశేషం ఏముంది అనుకోవద్దు. వరల్డ్ వైడ్ లీడింగ్ లో ఉన్న నెట్ ఫ్లిక్స్ లో అప్ లోడ్ అవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా స్పైడర్ రికార్డు సృష్టించబోతోంది. రేపట్నుంచి ఇది అందుబాటులోకి రాబోతోంది. 

థియేటర్లలో ఇప్పటికే డిజాస్టర్ అయిన ఈ సినిమా, టీవీల్లో కూడా ఫ్లాప్ అయింది. జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమాకు అతి తక్కువ రేటింగ్స్ వచ్చాయి. ఈ దెబ్బకు ఈ మూవీని మరోసారి రిపీట్ చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది సదరు ఛానెల్. ఇలాంటి టైమ్ లో స్పైడర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వస్తోంది. కనీసం డిజిటల్ వేదికపైనైనా ఇది క్లిక్ అయితే మహేష్ అభిమానులకు అదే పదివేలు.