Advertisement

Advertisement


Home > Movies - Movie News

శ్రీలీలకు అర్థం అయినట్లే వుంది

శ్రీలీలకు అర్థం అయినట్లే వుంది

పాటలు, డ్యాన్స్ లతో సర్రున దూసుకువచ్చింది ఇండస్ట్రీలోకి శ్రీలీల. ధమాకా ముందు వేరు. ధమాకా విజయం తరువాత వేరు. ఆ విజయం మొత్తం శ్రీలీల ఖాతాలో పడేసారు అంతా. దాంతో రోజుకు మూడు షిఫ్ట్ ల్లో పనిచేసేంత డిమాండ్ వచ్చేసింది. సినిమాలే సినిమాలు. అయితే ఆ క్రేజ్ కరిగిపోతోంది. రామ్ తో ఫ్లాప్, వైష్ణవ్ తేజ్ తో డిజాస్టర్. భగవంత్ కేసరి పరువు దక్కించినా క్రేజ్ ను మాత్రం పెంచలేదు.

ఇలాంటి టైమ్ లో వస్తోంది ఎక్స్ ట్రా ఆర్టినరీ మాన్. ఈ సినిమా మీద కూడా శ్రీలీలకు పెద్దగా ఆశలు లేనట్లు కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ మీట్ లో పెద్దగా సందడి చేయలేదు. ఎక్కువ మాట్లాడలేదు. పైగా ఈ సినిమాలో శ్రీలీల ది జస్ట్ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్ర మాత్రమే అని హీరో నితిన్ ముందే చెప్పేసారు. అందువల్ల ఎక్కువ ఊహించుకోవడానికి కూడా లేదు.

ఆదికేశవ సినిమాలో ఎంత ఎక్స్ పోజ్ చేయాలో అంతా చేసేసింది శ్రీలీల. ఇచ్చిన డబ్బుల మేరకు అంతకు అంతా చూపించే ప్రయత్నం చేసేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే తరహా అన్నట్లు కనిపిస్తోంది. పాటలు… వాటికి శ్రీలీల డ్యాన్స్ లు క్లిక్ అయి పేరు వస్తే సినిమా ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుంది. లేదూ అంటే ఇక మిగిలిన ఆశ అంతా గుంటూరు కారం మీదే. త్రివిక్రమ్ కాబట్టి బాగా ప్రెజెంట్ చేస్తారు అనే ఆశలు వున్నాయి.

అది కాకపోతే మాత్రం ఇక మిడ్ రేంజ్ హీరోల పక్కన కంటిన్యూ అయిపోవడమే శ్రీలీల.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?