cloudfront

Advertisement


Home > Movies - Movie News

ట్విట్టర్ వేదికగా శ్రీరెడ్డి వాంగ్మూలం

ట్విట్టర్ వేదికగా శ్రీరెడ్డి వాంగ్మూలం

పవన్ కల్యాణ్, అతడి అభిమానులు, పవన్ తల్లి తనను క్షమించాలంటూ రోజుకు కనీసం ఒకసారైనా వేడుకుంటున్న శ్రీరెడ్డి, తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు ఏమైనా జరిగితే మెగా కాంపౌండ్ దే పూర్తి బాధ్యత అంటూ ట్వీట్ చేసింది.

"నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో నాగబాబు దగ్గర నుండి. నాకు ఏమన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీ దే, ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం" ఇది శ్రీరెడ్డి తాజా ట్వీట్. 

పవన్ పిలుపుతో ఇప్పటికే శ్రీరెడ్డిని టార్గెట్ చేయడం తగ్గించారు అతడి అభిమానులు. అయినప్పటికీ తనకు వేధింపు కాల్స్ వస్తున్నాయని.. మరీ ముఖ్యంగా నాగబాబు తనను బెదిరిస్తున్నారని శ్రీరెడ్డి పబ్లిక్ గా ఆరోపించడం సంచలనమైంది.

ఒకే వీడియోను 5-6 సార్లు ట్వీట్ చేస్తున్న పవన్ కల్యాణ్, తన అభిమానుల్ని పరోక్షంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించింది శ్రీరెడ్డి. ఫొటోస్ లో ఉన్నవారిమీద దాడిచేయమని ఫ్యాన్స్ ను ఉసిగొల్పుతున్నట్టు ఆ వీడియోలు ఉంటున్నాయని, అమాయకులైన అభిమానులతో ఆడుకోవద్దని శ్రీరెడ్డి కోరింది.

తన ఉద్యమానికి టీవీ9, ఏబీఎన్, మహా ఛానెల్స్ తో ఎలాంటి సంబంధం లేదంటున్న శ్రీరెడ్డి.. పనిలోపనిగా వైఎస్ జగన్ కు ఓ ఉచిత సలహా పడేసింది. వైఎస్ఆర్ కు, జగన్ కు జనాల్లో విపరీతమైన అభిమానం ఉందని రౌడీ రాజకీయాలు చేసేవాళ్లను కలుపుకోవద్దని జగన్ ను కోరింది శ్రీరెడ్డి.