cloudfront

Advertisement


Home > Movies - Movie News

పవన్ కల్యాణ్ ఎవరో నాకు కూడా తెలీదు

బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ ప్రకటించిన నాగబాబు, ఈమధ్య కాలంలో వరుసగా బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ ఎపిసోడ్ లోకి శ్రీరెడ్డి కూడా దూరింది. నాగబాబు వ్యాఖ్యల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా పవన్ ఎవరో నాకు తెలీదంటూ వీడియో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.

"పవన్ నాకు తెలుసు. మంచి ఆర్టిస్ట్. చాలా టాలెంటెడ్. ఎలాంటి పెయింటింగ్ అయినా ఇట్టే వేస్తారు. పవన్ బాన్వాల్ అనే ఆయన మంచి పెయింటర్. ఆ పవన్ తప్ప వేరే పవన్ ఎవరూ నాకు తెలీదు. నా పవన్ మంచి ఆర్టిస్టు. ఈయన తప్ప వేరే పవన్లు కూడా ఉంటారు. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నార్మల్ పర్సన్స్ ఉంటారు. వాళ్లెవరో నాకు తెలీదు."

గతంలో బాలకృష్ణ తనకు తెలుసంటూ కమెడియన్ వల్లూరి బాలకృష్ణ ఫొటోను చూపించి నాగబాబు ఎలాగైతే రియాక్ట్ అయ్యారో.. సరిగ్గా అదే కోవలో తనకు పవన్ బాన్వాల్ మాత్రమే తెలుసంటూ శ్రీరెడ్డి రియాక్ట్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో పోస్ట్ పెడుతూ.. ఆంధ్ర నుంచి కొందరు తనకు ఫోన్ చేసి పవన్ అంటే ఎవరో వివరించారని చెప్పుకొచ్చింది.

"ఇప్పుడే నాకు ఆంధ్ర నుంచి కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. పవన్ అంటే దొంగచూపులు చూసుకుంటూ, దొంగ కోళ్లు పట్టేవారిలా ఉంటారట. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకుంటారట. ఎప్పుడూ అబద్ధాలు చెప్పుకుంటూ, పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ, దేశసేవ చేస్తానంటూ సొల్లు కొట్టుకుంటూ ఉంటారట."

ఇలా పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది శ్రీరెడ్డి. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో భాగంగా చెన్నైలో తిష్టవేసిన శ్రీరెడ్డి.. జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కు లేదన్నారు. పొలిటికల్ గా చిరంజీవి కంటే జగన్ సీరియర్ అంటోంది.

"12-13 ఏళ్ల పిల్లల్ని వెనకేసుకొని మీరు సోదిచెప్పి, వాళ్లతో అరిపించుకున్నంత మాత్రాన సీఎంగా అయిపోతానని అనుకోవడం బుల్ షిట్. యూఎస్ వెళ్లి డబ్బులు వద్దంటూ తీసుకోవడం, కులపిచ్చి లేదంటూ మీ కులాల్ని మెప్పించడం, అమ్మాయిల పిచ్చి లేదంటూనే వాళ్ల వెంటపడడం... ఇదేనా పవన్ అంటే."

పవన్ జీవితంలో ఏం చూసి యువత నేర్చుకోవాలని ప్రశ్నించింది శ్రీరెడ్డి. ఇకనైనా బాలయ్యను విమర్శించడం మానుకోవాలని, మాటలు అదుపులో పెట్టుకోవాలని సూచించింది.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్