cloudfront

Advertisement


Home > Movies - Movie News

గొడవ సద్దుమణిగింది.. మరి శ్రీరెడ్డి పరిస్థితేంటి?

గొడవ సద్దుమణిగింది.. మరి శ్రీరెడ్డి పరిస్థితేంటి?

నాగబాబు వీడియోల పరంపరకు బ్రేక్ పడింది. వివాదానికి సంబంధించి ఇదే నా ఆఖరి వీడియో అంటూ నాగబాబు చెప్పేశాడు. అటు బాలయ్య కూడా ఈ వ్యవహారంపై "నో కామెంట్" అంటూ నిమ్మకూరులో స్పందించాడు. మరి ఈ మొత్తం వ్యవహారంలో తగుదునమ్మా అంటూ మధ్యలో దూరిన శ్రీరెడ్డి పరిస్థితేంటి?

బాలయ్యపై వరుస వీడియోలతో నాగబాబు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. బాలయ్యకు మద్దతుగా శ్రీరెడ్డి కూడా రంగంలోకి దిగింది. మెగా కాంపౌండ్ పై ఉన్న అక్కసును వెల్లగక్కేందుకు ఈ వివాదాన్ని వేదికగా వాడుకుంది. బాలయ్యకు మద్దతిస్తున్నాననే ముసుగులో మెగా కాంపౌండ్ ను అనరాని మాటలంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వివాదం సద్దుమణిగినా శ్రీరెడ్డి మాత్రం సైలెంట్ అవ్వలేదు.

నాగబాబుపై ఏదో ఒకరకంగా కామెంట్లు పెడుతూనే ఉంది శ్రీరెడ్డి. బాలయ్యను పొగుడుతూ ఓసారి, నాగబాబును తిడుతూ మరోసారి ఆమె సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా ఈ విమర్శల పరంపరను రామ్ చరణ్ సినిమా వరకు తీసుకెళ్లింది.

ఈ సంక్రాంతికి బాలయ్య నటించిన కథానాయకుడు సినిమానే పెద్ద హిట్ అని, వినయ విధేయ రామ ఫ్లాప్ అయిందని చెబుతూనే.. నాగబాబు బయటకు వెళ్లలేకపోతున్నాడంటూ కామెంట్ పెట్టింది. నాగబాబు-బాలయ్య ఇష్యూలో వాళ్లిద్దరితో పాటు ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయ్యారు. మరి శ్రీరెడ్డి ఎప్పుడు సైలెట్ అవుతుందో?

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?