Advertisement


Home > Movies - Movie News
28 మందిపై కేసు పెట్టిన శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్నట్టు చెప్పుకుంటున్న నటి శ్రీరెడ్డి, మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీరెడ్డి, ఏకంగా 28మందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఏసీపీ అశోక్ చక్రవర్తికి వినతిపత్రం అందజేసింది.

శ్రీరెడ్డి ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో ప్రముఖంగా జీవితారాజశేఖర్ ఉన్నారు. ఈమెతో పాటు బాబు గోగినేని, పలువురు సినీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వీళ్లందరిపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది శ్రీరెడ్డి.

మరోవైపు ఇదే వినతిపత్రంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై కూడా ఆమె విరుచుకుపడింది. సోషల్ మీడియాలో తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనను ఫేస్ బుక్, వాట్సాప్ లో ఇబ్బందులకు గురిచేస్తున్న పవన్ కు చెందిన అలాంటి కొన్ని ఫ్యాన్ గ్రూప్స్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది.

మరోవైపు నిర్మాత సురేష్ బాబుపై తన విమర్శల్ని ఇంకా ఆపలేదు శ్రీరెడ్డి. సురేష్ మామ అంటూ ప్రతి రోజూ అతడిపై ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. 

"నిజాల్ని బయటపెట్టడంలో మీడియా సైలెంట్ గా ఉండకూడదు. సురేష్ మామ అండ్ కో చేసే అన్యాయాలు బయట ప్రపంచానికి తెలియజేయండి. చిన్న నిర్మాతల్ని సురేష్ మామ అండ్ కో, డిజిటైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో బ్రోకరేజ్ రూపంలో తినేస్తున్నారు. చిన్న నిర్మాతలు బతకాలి." ఇది తాజాగా సురేష్ బాబుపై శ్రీరెడ్డి ఆరోపణ. 

అటు శ్రీరెడ్డిపై కూడా ఓ కేసు నమోదైంది. తమ విధులు నిర్వర్తించకుండా పోలీసుల్ని శ్రీరెడ్డి అడ్డుకుందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.