కొన్ని రోజులుగా కాస్త సైలెంట్ అయిన సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. వాళ్లిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటోంది నటి శ్రీరెడ్డి. ఈ సందర్భంగా సమంతకు జీవిత పాఠాలు చెబుతోంది.
“సమంతపై నాకు చాలా గౌరవం ఉంది. ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి, అది కూడా ఫెయిల్ అయితే ఇంకోటి వస్తాయి. కానీ మేం అది కోరుకోవడం లేదు. నాగచైతన్య-సమంత కలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్, ఇగోలు ఉంటాయి. కానీ కాస్త సర్దుకుంటేనే జీవితం అని నేను నమ్ముతాను. కాబట్టి సమంత సర్దుకుకోవాలి. సమంత మాత్రమే కాదు, నాగచైతన్య అన్నయ్య కూడా సర్దుకోవాలి.”
కాపురం అన్న తర్వాత కలహాలు వస్తాయని, చిన్న చిన్న గిల్లికజ్జాలు సహజమని చెబుతున్న శ్రీరెడ్డి.. చైతూ-సమంత కూర్చొని తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన స్టార్ కపుల్, ఇలా విడిపోవడం తనకు ఇష్టం లేదని అంటోంది.
మనం ఎంత ప్రయత్నించినా హాలీవుడ్ మోడల్స్ లా తయారవ్వలేమని, ఈ విషయాన్ని సమంత గుర్తుపెట్టుకోవాలని అంటోంది శ్రీరెడ్డి. ఇప్పటికైనా సమంత వదిన వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకొని చక్కగా సంసారం చేసుకోవాలని శ్రీరెడ్డి సలహా ఇస్తోంది. ఇన్ని సూచనలు-సలహాలు ఇచ్చిన శ్రీరెడ్డి, తను మాత్రం పెళ్లి చేసుకోనని, భర్తతో వేగడం తన వల్ల కాదని ముక్తాయింపు ఇచ్చింది.