cloudfront

Advertisement


Home > Movies - Movie News

టాప్ క్రికెటర్ పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు..!

టాప్ క్రికెటర్ పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు..!

కాస్టింగ్ కౌచ్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్న శ్రీరెడ్డి మొన్నటివరకు టాలీవుడ్ సెలబ్రిటీస్ పై ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కోలీవుడ్ ప్రముఖుల్ని కూడా ఇందులోకి లాగింది. ఆధారాలు చూపించకపోయినా, వాళ్ల పేర్లు చెప్పి ఆరోపణలు మాత్రం సక్సెస్ ఫుల్ గా చేసింది. ఇప్పుడు తన ఆరోపణల పరంపరను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది శ్రీరెడ్డి. ఈసారి ఆమె ఎవరిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

"సచిన్ టెండూల్కరన్ అనే రొమాంటిక్ వ్యక్తి. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు, 'ఛార్మిం'గ్ గర్ల్ ఆయనతో రొమాన్స్ చేసింది. పెద్ద మనిషిగా పేరుకున్న చాముండేశ్వర స్వామి ఈ రొమాన్స్ కు మధ్యవర్తి. గొప్ప వ్యక్తులు బాగా ఆడతారు. నా ఉద్దేశం బాగా రొమాన్స్ చేస్తారని."

శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ఇది. ఇందులో ఆమె చెప్పిన వ్యక్తుల పేర్లు, సమాజంలో కొంతమంది ప్రముఖుల పేర్లకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ పేర్లు తెలియాలనే ఆమె ఇలా పోస్ట్ పెట్టిందనే విషయం ఇక్కడ అర్థమౌతోంది. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని మాత్రం శ్రీరెడ్డి చెప్పలేదు.

సచిన్ పేరును కాస్త మార్చి సచిన్ టెండూల్కరన్ అని, చాముండేశ్వరినాథ్ పేరును చాముండేశ్వర స్వామి అని శ్రీరెడ్డి మార్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇక సచిన్ తో రొమాన్స్ (సెక్స్) చేసిన ఆ అమ్మాయిని చార్మింగ్ బ్యూటీ అని పేర్కొంది. 

మరోవైపు లారెన్స్ పై ఆమె ఆరోపణల వర్షం కొనసాగుతూనే ఉంది. పైకి శ్రీరామచంద్రుడిలా కనిపించే లారెన్స్, అమ్మాయిల్ని వాడుకోవడంలో నంబర్ వన్ అంటూ గతంలోనే ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు వాటికి సాక్ష్యంగా ఓ వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసింది. ఓ 10 మంది అమ్మాయిల్ని లారెన్స్ రిసార్ట్ కు తీసుకెళ్తున్నాడని, ఆ సీన్ ను తను చూశానంటూ ఓ వ్యక్తి శ్రీరెడ్డికి మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ ను యథాతథంగా పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.

కాస్టింగ్ కౌచ్ కింద సెలబ్రిటీల్ని బాగానే టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, అందుకు ప్రతిఫలంగా బాగానే పాపులర్ అయింది కూడా. ఆ పాపులారిటీతో తమిళనాట ఓ సినిమా ఛాన్స్ కూడా సంపాదించిందామె. చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించింది. తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి రకరకాల పోస్టులు పెడుతున్న శ్రీరెడ్డి, తన సినిమా ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు.