cloudfront

Advertisement


Home > Movies - Movie News

శ్రీనివాస కల్యాణం Vs శతమానంభవతి

శ్రీనివాస కల్యాణం Vs శతమానంభవతి

పెళ్లి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా శతమానం భవతి. సరిగ్గా ఇదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది శ్రీనివాసకల్యాణం. ఇక శతమానంభవతి సినిమాలో విలన్ కనిపించడు. సేమ్ టు సేమ్ శ్రీనివాస కల్యాణం సినిమాలో కూడా విలన్ కనిపించడు. శతమానంభవతి సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు. శ్రీనివాస కల్యాణం సినిమాకు కూడా దర్శకుడు అతడే. ఇక ఈ రెండు సినిమాలకు సంగీత దర్శకుడు, నిర్మాత కూడా కామన్. అలాంటప్పుడు శ్రీనివాసకల్యాణంలో స్పెషాలిటీ ఏముంటుంది..?

ఈ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది రాశిఖన్నా. శతమానం భవతి, శ్రీనివాసకల్యాణం సినిమాకు అస్సలు సంబంధం లేదంటోంది. సినిమా చూసిన తర్వాత ఈ విషయాన్ని అంతా ఒప్పుకుంటారని అంటోంది. కానీ తేడాలు చెప్పమంటే మాత్రం చెప్పనంటోంది. ఎంతో బలవంతం మీద ఒకే ఒక్క తేడా చెప్పింది.

శతమానంభవతి సినిమాలో పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపిస్తాయట. అందులో లవ్ ఓ పార్ట్ గా ఉంటుందట. కానీ ఇందులో లవ్ అనేది మొదటి ఎమోషన్ అట. దానికి ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోడవుతాయంట. ఇలా తన సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రాశిఖన్నా. శతమానంభవతి తను చూశానని, దానికి శ్రీనివాసకల్యాణం సినిమాకు సంబంధం ఉండదని గట్టిగా చెబుతోంది.

ఈ సినిమాలో నటించడం తన అదృష్టం అంటోంది రాశి. ఈ సినిమా చేసిన తర్వాత రియల్ లైఫ్ లో తను కూడా తెలుగు సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటారని, అంతలా అందర్నీ కదిలిస్తుందని అంటోంది. ఈ గురువారం థియేటర్లలోకి వస్తోంది శ్రీనివాసకల్యాణం.