Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా..నందమూరి..మధ్యలో టెక్నీషియన్లు

మెగా..నందమూరి..మధ్యలో టెక్నీషియన్లు

అటు చూస్తే సేమ్యా ఇడ్లీ..ఇటు చూస్తే బాదం హల్వా అన్నారు కవి శ్రీశ్రీ ఓసారి తన కవితలో. అటు చూస్తే మెగా సినిమా ఇటు చూస్తే నందమూరి పిక్చర్. అటు చూస్తే దేవీ..ఇటు చూస్తే థమన్..అటు చూస్తే మలినేని..ఇటు చూస్తే పవర్ బాబీ కానీ రెండింట్లో కామన్ శృతిహాసన్..మైత్రీ మూవీస్. ఇప్పుడు సమస్య ఏది చూడాలా? అని కాదు. రెండూ చూస్తారు. అందులో సందేహం లేదు. కానీ రెండింటికీ పోటీ..ఏది బెటర్ అనిపించుకుంటుంది. ఏ పాటలు బాగుంటాయి. ఏ కథ సూపర్ గా వుంటుంది. ఇలా అన్నింటా పోటీ..పోటీ..పోటీ.

సంక్రాంతికి వస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య కొత్త కథలు కావు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒకటికి పది సార్లు చూసేసిన కథలే. అయితే వాటినే ఇద్దరు దర్శకులు తమ స్టయిల్ లో కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్న-చెల్లెలు కీలకం ఒక దాంట్లో. అది నందమూరి సినిమా. అన్న-తమ్ముడు కీలకం మరో దాంట్లో. ఇది మెగా మూవీ. ఒక సినిమా హెవీ ఎమోషనల్ మాస్…మరో సినిమా ఫుల్ ఫన్ మాస్.

నందమూరి సినిమా ఆయనకు ప్రూవ్ అయిన జానర్. మెగా మూవీ ఈయనకు ఫ్యాన్స్ చూడాలని కోరుకునే జానర్. ఏ సినిమాకూ ఏ టెక్నీషియన్ తక్కువ చేయడానికి లేదు. పబ్లిసిటీ దగ్గర నుంచి డైరక్షన్ వరకు. పాటల నుంచి మాటల వరకు. ప్రతి ఒక్కటి పోల్చి చూసుకునే పరిస్థితి. విడుదలయిన తరువాత ఈ పోటీ ఇంకా తీవ్రంగా వుంటుంది. అది ఈ సినిమాకు పని చేస్తున్న ప్రతి టెక్నీషియన్ ను టెన్షన్ కు గురి చేస్తోంది. ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఏ మేరకు వుంటుందో, అదంతా తమ కెరీర్ ను ఎలా ప్రభావితం చేస్తుందో అనే టెన్షన్ వెన్నాడుతోంది.

ఎందుకంటే ఏ టెక్నీషియన్ వర్క్ ఏ సినిమాకు ఎంత హెల్ప్ చేస్తుందో తెలియదు. పాటలు బాగుంటే ఒకలా వుంటుంది. మాటలు అదిరిపోతే ఇంకోలా వుంటుంది. అర్ ఆర్ పేలితే అదో రేంజ్. అన్నింటికి మించి స్క్రిప్ట్ సంగతి సరేసరి.

సంక్రాంతి లాంటి పెద్ద సీజన్ లో ఒకేసారి రెండు పెద్ద సినిమాలు పోటా పోటీగా విడుదల కావడం వల్ల వస్తున్న సమస్య ఇది.

గమ్మత్తేమిటంటే… ఒక్క విషయంలో మాత్రం పోటీ లేదు. మెగాస్టార్ సినిమా అమ్మకం, టర్నోవర్, రేట్లు ఎక్కువ. బాలయ్య సినిమా రేట్లు, టర్నోవర్ తక్కువ. కానీ బాలయ్య సినిమాకు చేస్తున్న ఖర్చు మాత్రం అదుపులేనంత.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?