సమాజంలోని అసమానతల్ని, కులాల మధ్య అంతరాల్ని పలాస సినిమాలో చర్చించాడు దర్శకుడు కరుణ కుమార్. ఆ సినిమా తర్వాత సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తీశాడు. మరి ఈ సినిమాలో కూడా సందేశం ఏమైనా చొప్పించాడా లేక కమర్షియల్ యాంగిల్ లో సినిమా తీశాడా?
ఈ ప్రశ్నకు స్వయంగా సుధీర్ బాబు స్పందించాడు. పలాస సినిమా టైపులోనే, తను నటించిన శ్రీదేవి సోడా సెంటర్ లో కూడా ఓ మంచి సందేశం ఉందంటున్నాడు. ప్రస్తుతం సమాజంలో అందరం చూస్తున్న ఓ బర్నింగ్ పాయింట్ ను ఈ సినిమాలో చర్చించామని చెబుతున్నాడు.
“శ్రీదేవి సోడా సెంటర్ లో కూడా ఓ సందేశం ఉంది. ప్రస్తుతం మన కళ్ల ముందు జరుగుతున్న ఓ బర్నింగ్ టాపిక్ ను ఈ సినిమాలో చర్చించాం. దర్శకుడు కరుణకుమార్ రైటింగ్ స్టయిల్ లోనే అది ఉంది. సమాజంలో అసమానతల్ని ఆయన డిస్కస్ చేస్తారు. ఈ సినిమాలో కూడా అది ఉంది. సినిమా చూసిన తర్వాత జనాలు ఆ బర్నింగ్ పాయింట్ గురించి చర్చించుకుంటారు.”
శ్రీదేవి సోడా సెంటర్ లో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నాడు సుధీర్ బాబు. కొన్ని షాట్స్ తీయడానికి ఫిజికల్ గా కష్టపడ్డాడు తప్ప, నటన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదంట. ఎందుకంటే, సినిమాలో సూరిబాబు పాత్ర అంత క్లారిటీతో ఉందంటున్నాడు ఈ హీరో. ఇక సినిమాలో ఓ షాట్ కోసం 6 సార్లు పైనుంచి కిందకు దూకాడట సుధీర్ బాబు. అలా జంప్ చేసిన ప్రతి సారి దెబ్బలు తిన్నానని చెప్పుకొచ్చాడు.