Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరోయిన్ కి అత‌డు రూ.ప‌దికోట్ల గిఫ్ట్ లిచ్చాడు!

హీరోయిన్ కి అత‌డు రూ.ప‌దికోట్ల గిఫ్ట్ లిచ్చాడు!

200 కోట్ల రూపాయ‌ల చీటింగ్, మ‌నీలాండ‌రింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ నుంచి న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ భారీ ఎత్తున బ‌హుమ‌తులు పొందిన‌ట్టుగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ త‌న చార్జిషీట్లో పేర్కొంది. గ‌త కొన్నాళ్లుగా ఈ వ్య‌వ‌హారంలో ఈడీ విచార‌ణ‌ను కూడా ఎదుర్కొంటోంది జాక్వెలిన్. ఈ క్ర‌మంలో ఆమెకు అత‌డు భారీ ఎత్తున బ‌హుమ‌తులు ఇచ్చిన‌ట్టుగా ఈడీ పేర్కొంది. 

వివాహితుడు అయిన సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ తో జాక్వెలిన్ చాలా క్లోజ్ గా ఉంటూ వ‌చ్చింది. ఇప్పుడు అత‌డిపై కేసుల విచార‌ణ నేప‌థ్యంలో.. అత‌డూ, జాక్వెలిన్ డేటింగ్ చేశార‌నే ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని సుఖేష్ లాయ‌ర్ కోర్టుకు చెప్పాడు. అయితే జాక్వెలిన్ మాత్రం త‌ను అత‌డితో డేటింగ్ చేయ‌న‌ట్టుగా చెప్పింద‌ట‌. ఆ సంగ‌త‌లా ఉంటే.. జాక్వెలిన్ కు సుఖేష్ ప‌ది కోట్ల రూపాయ‌ల విలువైన బ‌హుమతులు ఇచ్చాడ‌నే వార్త హాట్ టాపిక్ గా మారింది.

జాక్వెలిన్ కు అత‌డు ఇచ్చిన ఖ‌రీదైన బ‌హుమ‌తుల్లో ఒక గుర్రం కూడా ఉంద‌ట‌. యాభై ఒక్క ల‌క్ష విలువైన ఒక మేలు జాతి అశ్వాన్ని అత‌డు ఆమెకు బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ట‌. అలాగే  ఒక పిల్లి కూడా ఇచ్చాడ‌ట దాని విలువ సుమారు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌ట‌!

ఇక నోరా ఫ‌తే కు కూడా సుఖేష్ నుంచి భారీ గిఫ్ట్ లు అందాయ‌ని ఈడీ పేర్కొంది. ఆమెకు సుమారు కోటి విలువైన బ‌హుమ‌తులు ఇచ్చాడ‌ట అత‌డు. వాటిలో ఐఫోన్, బీఎండ‌బ్ల్యూ కారు వంటివి అతడు ఇచ్చిన బ‌హుమ‌తుల్లో ఉన్నాయ‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని అత‌డే ధ్రువీక‌రించిన‌ట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అత‌డితో వారి సంబంధాలు ఏవో కానీ.. చీటింగ్ మొత్తాల‌ను బహుమ‌తులుగా తీసుకుని జాక్వెలిన్, నోరాలు ఇప్పుడు విచార‌ణ సంస్థ‌ల చుట్టూ తిరుగుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?