Advertisement


Home > Movies - Movie News
అఫీషియల్: మహేష్ తో మరోసారి..!

రంగస్థలంతో గ్రాండ్ హిట్ కొట్టిన సుకుమార్, తన నెక్ట్స్ సినిమాను ఎవరితో చేస్తాడనే విషయంపై మొన్నటివరకు చాలా స్పెక్యులేషన్ నడిచింది. బన్నీ, ప్రభాస్, మహేష్ లాంటి పేర్ల చుట్టూ చాలా గాసిప్స్ నడిచాయి. ఎట్టకేలకు ఈ ఎపిసోడ్ కు తెరదించాడు దర్శకుడు సుకుమార్.

తన నెక్ట్ సినిమాను మహేష్ తో చేయబోతున్నట్టు ప్రకటించాడు సుక్కూ. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వన్-నేనొక్కడినే సినిమా వచ్చింది. అది అట్టర్ ఫ్లాప్ అయింది. మహేష్ కు ఎలాగైనా ఓ హిట్ సినిమా ఇస్తానని పదేపదే చెబుతున్న సుకుమార్, ఈసారి మహేష్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్నట్టు తెలిపాడు. స్టోరీలైన్ ను ఇప్పటికే మహేష్ తో చర్చించానని, ఆ లైన్ ను డెవలప్ చేసే పనిలో ఉన్నానని ప్రకటించాడు.

మహేష్ సినిమాకు కూడా సుకుమార్ లాజిక్స్ ను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. రంగస్థలం సినిమాను 80ల నాటి బ్యాక్ డ్రాప్ లో స్ట్రయిట్ నెరేషన్ తో తీసిన సుకుమార్.. మహేష్ కోసం కూడా ఓ డిఫరెంట్ కథ రాస్తున్నానని, అది తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలిపాడు. అంటే లాజిక్స్ లేనట్టే.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్. లెక్కప్రకారం ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేయాలి. కానీ సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. సో.. అటు త్రివిక్రమ్, ఇటు సుకుమార్ లో మహేష్ ఎవరితో సినిమా చేస్తాడో తెలియాలంటే, వంశీ పైడిపల్లి సినిమా ఓ కొలిక్కిరావాలి.

చూస్తుంటే.. సుకుమార్ కు ఈసారి కూడా గ్యాప్ తప్పేలా లేదు. ప్రాజెక్టు ఎప్పుడు ఫైనలైజ్ అయినా, అది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే ఉంటుంది.