మరో శిష్యుడ్ని పరిచయం చేస్తున్న సుక్కు

ఇప్పటికే కొంతమంది శిష్యుల్ని దర్శకులుగా పరిచయం చేశాడు సుకుమార్. తాజాగా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు కూడా సుకుమార్ శిష్యుడే. ఇప్పుడీ డైరక్టర్ తన గ్యాంగ్ నుంచి మరో డైరక్టర్ ను పరిచయం…

ఇప్పటికే కొంతమంది శిష్యుల్ని దర్శకులుగా పరిచయం చేశాడు సుకుమార్. తాజాగా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు కూడా సుకుమార్ శిష్యుడే. ఇప్పుడీ డైరక్టర్ తన గ్యాంగ్ నుంచి మరో డైరక్టర్ ను పరిచయం చేయబోతున్నాడు. అతడి పేరు వెంకీ.

కొన్నేళ్లుగా సుకుమార్ దగ్గర పనిచేస్తున్నాడు వెంకీ. సుకుమార్ తీసిన ఎన్నో సినిమాలకు రైటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాడు. ఇప్పుడితడికి అవకాశం వచ్చింది. రానా హీరోగా వెంకీ దర్శకత్వంలో సినిమా లాక్ అయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

సుకుమార్ శిష్యులంతా డిఫరెంట్ కథలతోనే వచ్చారు. ఎవ్వరూ రొటీన్ సినిమాలు తీయలేదు. రీసెంట్ గా వచ్చిన ప్లే బ్యాక్ అనే క్రాస్-టైమ్ జానర్ సినిమా కూడా సుకుమార్ శిష్యుడు (హరిప్రసాద్ జక్కా) తీసిందే. సో.. రానా ఒప్పుకున్నాడంటే, వెంకీ రాసుకున్న కథ కూడా కాస్త కొత్తగానే ఉందని అర్థం.

ప్రస్తుతం అరణ్య సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు రానా. ఆ తర్వాత విరాటపర్వం ప్రచారంలో పాల్గొంటాడు. వీటితో పాటు మిలింద్ రావ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే వెంకీ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవుతుంది. 

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే