Advertisement

Advertisement


Home > Movies - Movie News

సుకుమార్..బన్నీ..అరాచకం

సుకుమార్..బన్నీ..అరాచకం

ఆర్య, వన్ ఒక్కడినే, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు చూస్తే దర్శకుడు సుకుమార్ ఓ క్లాస్ టచ్ ఎమోషనల్ ఫిల్మ్ మేకర్ అనే భావన ఎవరైనా వుండి వుంటే రంగస్థలం సినిమాతో దాన్ని పటాపంచలు చేసేసారు. 

పక్కా ఓ రా ఫిల్మ్ ను ఫన్ తో మిక్స్ చేసి, డెప్త్ వున్న కథను మరింత బలంగా చెప్పి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. లేటెస్ట్ గా అడవి నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో హీరో బన్నీతో 'పుష్ప' సినిమా చేస్తున్నారు.

బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ వదిలారు. నిజానికి పుష్ప సినిమా షూట్ చాలా అంటే చాలా వుంది. ఇప్పటి వరకు తీసింది అడవి ఎపిసోడ్ మాత్రమే. సినిమాలో బన్నీ స్టయిలిష్ అవతారం ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు. కానీ జనాలకు అది కొత్త కాదు. ఈ అడవి, రఫ్ గెటప్ కొత్త. అందుకే అదే కట్ చేసారు. 

అడవి, డ్రోన్ షాట్లు, ఛేజింగ్ లు, ఫైట్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో వున్నాయి. తగ్గదే లే అన్న బన్నీ డైలాగు ఫ్యాన్స్ ను ఎంత కిర్రెక్కించాలో అంతా కిర్రెక్కిస్తుంది. క్వాలిటీ వర్క్, దేవీ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, భారీ చిత్రీకరణ అన్నీ కలిసి ఈ టీజర్ ను అరాచకం నెక్ట్స్ లెవెల్ కు తీసుకుపోయి, సినిమా మీద అంచనాలు మరింత పెంచేసాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?