బుల్లితెర ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయలకు స్ట్రాంగ్ వార్నింగ్. ఏహే…వాళ్లకు వార్నింగ్‌లిచ్చేంత దమ్ము, ధైర్యం ఎవరికని ప్రశ్నిస్తారా? ఎంతటి వాళ్లనైనా భయపెట్టే అదృశ్య వైరస్ ఒకటి ప్రపంచాన్ని చుట్టేసిందనే విషయాన్ని మరిచిపోతే ఎలా?
బాలీ వుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడడంతో భాషలతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమంతా ఒక్క సారిగా భయంతో ఉలిక్కి పడింది.
తనను ఖాతరు చేయకుండా షూటింగ్‌లంటూ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఏమవుతుందో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌తో పాటు ఆయన కుమారుడు, కోడలు, మనుమరాలికి కరోనా ఆవహించి తన ప్రతాపం చూపింది. దీంతో అమితాబ్ అంతటి పెద్దాయన్నే విడిచి పెట్టని కరోనా ముందు….ఇక తామెంత అని బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు వణికిపోతూ నెమ్మదిగా సర్దుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బుల్లితెర ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయలు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గే వరకు షూటింగ్‌ల్లో పాల్గొనకూడదని సుమ, అనసూయ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే పలువురు టీవీ సీరియల్స్ నటులు కరోనా బారిన పడడంతో ఆర్టిస్టులు బిక్కుబిక్కుమంటూ షూటింగ్‌ల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
అయితే 24 గంటలూ ఏదో ఒక షోకి సంబంధించి షూటింగ్‌ల్లో ముఖ్యంగా సుమ, అనసూయ పాల్గొంటారనే విషయం తెలిసిందే. కానీ హైదరాబాద్‌లో కరోనా విజృంభణ తారాస్థాయికి చేరడంతో ఎక్కడ ఏ రూపంలో దాక్కుని ఉందోనని నటీనటులు భయాం దోళనకు గురవుతున్నారు. దీంతో పరిస్థితులు మెరుగు పడే వరకు షూటింగ్‌లకు గుడ్‌బై చెప్పడమే మంచిదనే నిర్ణయానికి సుమ, అనసూయ వచ్చారని తెలుస్తోంది.
ఎవరికైనా ఆరోగ్యం తర్వాతే ఏదైనా, ఏమైనా. ఈ సమాచారంపై వాళ్లద్దరూ స్పష్టత ఇస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.