Advertisement

Advertisement


Home > Movies - Movie News

సుమ స్పోర్ట్స్ కామెంటరీ

సుమ స్పోర్ట్స్ కామెంటరీ

తెలుగు నాట షో లు నిర్వహించాలన్నా, సినిమా ఫంక్షన్లు నిర్వహించాలన్నా, గ్రూపు ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేయాలన్నా సుమ తరువాత ఎవరికైనా చాన్స్. ఆమె వద్దంటే, లేదా ఆమె రెమ్యూనిరేషన భరించడం కష్టం అనుకుంటే అప్పుడు వేరేవాళ్లకు చాన్స్ వస్తుంది. 

సుమ ఎప్పుడో ఒక్కసారి సినిమాలో నటించింది. ఆ తరువాత సినిమా పంక్షన్ లకే తప్ప సినిమాలకు దూరంగా వుంటూ వస్తోంది. 

అలాంటిది ఇప్పుడు ఓ సినిమాకు తన గొంతు ఇవ్వబోతోంది. సందీప్ కిషన్ నటించిన ఎ 1 ఎక్స్ ప్రెస్ సినిమా హాకీ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమా క్లయిమాక్స్ లో సుమారు 20 నిమషాల పాటు హాకీ మ్యాచ్ వుంటుంది. 

ఈ మ్యాచ్ కు సహజంగానే కామెంటరీ అవసరం పడింది. ఈ కామెంటరీని సుమ చేత చెప్పించారట. సుమ తన స్టయిల్ వెటకారం మేళవించకుండా సీరియస్ గా కామెంటరీ చెప్పడం విశేషం. 

సుమకు కామెంటరీ బాక్స్ లో వైవా హర్ష తోడయ్యాడట. మరి ఇంతకీ సుమ గొంతే వినిపిస్తారో? ఆమెను కూడా చూపిస్తారో? అలా అయితే చాలా కాలం తరువాత పెద్ద తెర మీద సుమను చూసినట్లు అవుతుంది.

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?