cloudfront

Advertisement


Home > Movies - Movie News

తాతగారి కోసం బరువు తగ్గాను

తాతగారి కోసం బరువు తగ్గాను

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటపెట్టాడు హీరో సుమంత్. బయోపిక్ లో తాతగారి పాత్ర పోషించిన సుమంత్.. ఏఎన్నార్ గెటప్ కోసం 5 కిలోలు బరువు తగ్గానంటున్నాడు. తాతగారి పాత్రకు క్రిష్ రాసిన లైన్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నాడు.

"క్రిష్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఎన్టీఆర్ బయోపిక్ లో మా తాతగారి కోసం భలే లైన్స్ రాసుకున్నాడు. ఎన్టీఆర్-ఏఎన్నార్ అనుబంధం గురించి అందరికీ తెలుసు. దాన్ని ఎలివేట్ చేసేలా భలేగా రాశాడు. క్రిష్ నాకు ఈ రోల్ ఆఫర్ చేయడం చాలా అదృష్టంగా, సంతోషంగా భావిస్తున్నాను."

ఇప్పటివరకు తను చేసిన పాత్రల్లో తాతగారి పాత్రే చాలా క్లిష్టమైందని అంటున్నాడు సుమంత్. తాతగారి నటన, మేనరిజమ్స్ అందరికీ తెలుసు కాబట్టి, వాటిని యథాతథంగా తిరిగి తెరపై చూపించడానికి చాలా కష్టపడ్డానంటున్నాడు.

"తాతగారి పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. 5-6 కిలోలు తగ్గాను. ఎందుకంటే అప్పట్లో తాతగారు బక్కగా ఉండేవారు. ఈ క్యారెక్టర్ కాస్త ఛాలెంజింగ్ అనిపించింది. ఫస్ట్ డే కాస్త ఇబ్బంది పడ్డాను. తర్వాత క్రిష్, మేకప్ మేన్ సహకారంతో అలవాటుపడ్డాను."

ఏఎన్నార్ ను బాబాయ్ అని పిలిచే బాలయ్య కూడా తనకు మంచి సహకారం అందించారని, ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ కు మెరుగులు దిద్దారని అన్నాడు సుమంత్. బయోపిక్ కు సంబంధించి 2 భాగాల్లో తను కనిపిస్తానని స్పష్టంచేశాడు.

"16 రోజులు షూట్ చేశాను. బయోపిక్ కు సంబంధించి నా పార్ట్ మొత్తం పూర్తయింది. ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో మాత్రమే నేనుంటానని చాలామంది అనుకుంటున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ కు సంబంధించిన పార్ట్-2లో కూడా ఏఎన్నార్ పాత్రలో నేను కనిపిస్తాను."

క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-1 సంక్రాంతికి రాబోతోంది. పార్ట్-2ను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్