cloudfront

Advertisement


Home > Movies - Movie News

సమ్మర్ ఎండింగ్ లో సరదా సినిమాలు

సమ్మర్ ఎండింగ్ లో సరదా సినిమాలు

సమ్మర్ అంటే సరదా, సమ్మర్ అంటే ఫన్. ఈ సమ్మర్ కు అన్నీ సీరియస్ సినిమాలే వచ్చాయి. ఒక్క కాంచన 3 మాత్రమే కాస్త నవ్వులు పండించే ప్రయత్నం లేదా, థ్రిల్ కలిగించే ప్రయత్నం చేసింది. అవెంజర్స్ వచ్చింది. కానీ ఓ రేంజ్ వరకు వెళ్లి ఆగిపోయింది. తెలుగునాట అంచనా వేసిన మేరకు ఆడలేదనే చెప్పాలి.

అయితే ఈ నెల 24న రెండు అలాగే 31 ఒక సినిమా వస్తున్నాయి. వాస్తవానికి సమ్మర్ సీజన్ క్లోజింగ్ టైమ్ లో వస్తున్నాయి ఈ సినిమాలు.

వీటిలో ఒకటి 24న విడుదలవుతున్న లీసా త్రీడీ సినిమా. అంజలి నటించిన హర్రర్ మూవీ ఇది. హర్రర్ మూవీ లు త్రీడీలో రావడం ఇదే ఫస్ట్ టైమ్.  త్రీడీ అనగానే, హర్రర్ మూవీ అనగానే కాస్త ఆసక్తి వుంటుంది. రాజు విశ్వనాథ్‌ దర్శకుడు. సురేష్‌ కొండేటి నిర్మాత. సంతోష్‌ దయానిధి మ్యూజిక్‌ డైరెక్టర్. ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్లు కొత్తగా వుంటాయని, అంజలికీ ఈ సినిమా మాంచి పేరు తెస్తుందని యూనిట్ నమ్ముతోంది.

24న అల్లాదీన్ సినిమా కూడా విడుదలవుతోంది. తెలిసిన సబ్జెక్ట్ నే కానీ, డిస్నీ సినిమా కాబట్టి కాస్త సరదా, ఆసక్తి వుంటుంది.

31న విడుదలవుతోంది సువర్ణ సుందరి సినిమా. ఇటీవల కాలంలో ఓ చిన్న సినిమాకు ఇంత రేంజ్ గ్రాఫిక్స్ సెట్ చేసిన సినిమా ఇదే. అందువల్ల దీనిని ఖర్చు రీత్యా చిన్న సినిమా అనడానికి వీలు లేదు. జయప్రద లాంటి సీనియర్ హీరోయిన్ సాక్షిచౌదరి, పూర్ణ లాంటి నటులు వున్నారు ఈ సినిమాలో. ఎమ్ఎస్ఎన్ సూర్య దర్శకుడు.

ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు భారీగా ఖర్చుచేసారని అవి పిల్లలను పెద్దలను ఆకట్టుకుంటాయని యూనిట్ నమ్ముతోంది.

మొత్తానికి 24న, 31న కలిసి మూడు ఎంటర్ టైన్ మెంట్ జోనర్ సినిమాలు వస్తున్నాయి. వీటి ఫలితం ఎలా వుంటుందో చూడాలి.