cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

నా గ్లాస్ మేట్ త్రివిక్రమ్.. అంతా అతడే

నా గ్లాస్ మేట్ త్రివిక్రమ్.. అంతా అతడే

తనకు క్లాస్ మేట్ అయినా, సోల్ మేట్ అయినా, గ్లాస్ మేట్ అయినా అంతా త్రివిక్రమ్ అంటున్నాడు కమెడియన్ సునీల్. చిత్రలహరి సినిమాలో హీరో సాయి తేజ్ కు గ్లాస్ మేట్ గా వ్యవహరించిన ఈ హాస్యనటుడు.. రియల్ లైఫ్ లో మాత్రం తన గ్లాస్ మేట్ త్రివిక్రమ్ అంటున్నాడు.

"భీమవరంలో త్రివిక్రమ్ నా కంటే ఏడాది సీనియర్. కానీ సినిమాలపై మోజుతో ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చేశాను. ఆ తర్వాత త్రివిక్రమ్ ను తీసుకొచ్చాను. నా కోసమే త్రివిక్రమ్ ను హైదరాబాద్ తీసుకొచ్చాను. నా జీవితానికి సంబంధించిన ఎలాంటి విషయాన్నయినా నేను త్రివిక్రమ్ తో మాత్రమే పంచుకుంటాను. అతడితో కాసేపు మాట్లాడితే చాలు ఎంతో ఎనర్జీ వస్తుంది."

ఇలా తన రియల్ లైఫ్ గ్లాస్ మేట్ ముచ్చట్లు బయటపెట్టాడు సునీల్. ఎంత బాధల్లో ఉన్నప్పటికీ మనల్ని మామూలు మనుషులుగా మార్చే శక్తి త్రివిక్రమ్ లో ఉందంటున్నాడు సునీల్. ఇప్పటికీ నెలకు కనీసం 2 సార్లయినా తామిద్దరం ప్రత్యేకంగా కలుసుకొని మాట్లాడుకుంటామన్నాడు.

హీరోగా ఫెయిలై, కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చిన సునీల్.. తన సెకెండ్ ఫేజ్ కూడా చాలా బాగుందంటున్నాడు. హీరోగా ఇంకా 2 సినిమాలు చేయాల్సి ఉందని, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చాడు.

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!