Advertisement


Home > Movies - Movie News
‘సూర్య’ ఫంక్షన్ కు ‘చిట్టిబాబు’

మెగా ఫ్యామిలీ ఒక్క తాటిమీదకు వచ్చేసింది. అందులో అణుమాత్రం సందేహం లేదు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కోసం ఫిల్మ్ చాంబర్ కు కదలివచ్చారు ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ మెంబర్. అదే పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మళ్లీ మరోసారి అలాంటి ఈవెంట్ జరగబోతోంది. ఈనెల 29న జరిగే నా పేరు సూర్య ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.

రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో రామ్ చరణ్ మాంచి హ్యాపీ మూడ్ లో వున్నాడు. భరత్ అనే నేను ఫంక్షన్ నాడు రాత్రి మహేష్ ఇంట్లో ఇచ్చిన పార్టీకి హాజరయ్యాడు. ఇప్పుడు బన్నీ సినిమా నా పేరు సూర్య ఫంక్షన్ కు అతిథిగా రాబోతున్నాడు. వాస్తవానికి మెగాస్టార్ వుంటే ఆయనే హాజరయ్యేవారు. కానీ ఆయన విదేశాల్లో వున్నారు. అందుకే మెగా వారసుడు చరణ్ వస్తున్నాడు.

మిలటరీ, తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో వక్కంతం వంశీ డైరక్షన్ లో రూపుదిద్దుకున్న నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్ మొన్ననే మిలటరీ మాధవరంలో జరిగింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో చేస్తున్నారు. గచ్చిబౌలిలో జరిగే ఈ వేడుకకు మెగాభిమానులు అందరూ హాజరవుతారు. అందుకోసం కాస్త భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.