Advertisement

Advertisement


Home > Movies - Movie News

సుశాంత్ ను త్రివిక్రమ్ అయినా నిలబెడతాడా?

సుశాంత్ ను త్రివిక్రమ్ అయినా నిలబెడతాడా?

దాదాపు పదేళ్ల కిందటి నుంచి సుశాంత్ దండయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. నాగార్జున మేనల్లుడు, ఏఎన్నార్ మనవడు అనే ట్యాగ్స్ లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సుశాంత్ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు. హోం బ్యానర్ పై పలు సినిమాల్లో నటించాడు. అయితే ఇటీవలి 'చిలసౌ' మాత్రమే సుశాంత్ కు ఎంతోకొంత ఊరటను ఇచ్చింది. అయితే 'కరెంట్' సినిమా రెగ్యులర్ గా టీవీలో ప్రసారం అవుతూనే ఉంటుంది. అలా ఈ హీరో ప్రేక్షకులకు గుర్తుంటూ వస్తున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో సుశాంత్ కొత్త రకం పాత్రలోకి ఎంటరవుతూ ఉన్నాడు. అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురంలో'లో తను ఒక పాత్రను పోషిస్తున్నట్టుగా ఈ హీరో ప్రకటించుకున్నాడు. ఒక స్టార్ హీరో సినిమాలో సుశాంత్ నటించాడంటే.. దాని ప్రాధాన్యత ఎంత అనేది ఆసక్తిదాయకంగా మారుతూ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి హీరోలు నటించడం కొత్త ఏమీకాదు.

అయితే ఇలాంటి పాత్రలు చేస్తూ కొందరు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు, మరి కొందరు.. చివరకు అలాంటి పాత్రలకే పరిమితం అయ్యారు కూడా. నవదీప్, ప్రిన్స్, రాహుల్ రవీంద్రన్.. ఇలాంటి వాళ్లంతా వేరే హీరోల సినిమాల్లో నటించినా, వారి కెరీర్ కు అవి ఉపయోగపడలేదు. ఈ క్రమంలో సుశాంత్ కెరీర్ కు ఈ సినిమాతో త్రివిక్రమ్ ఎలాంటి బూస్టప్ ఇవ్వబోతున్నాడో!

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?