Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప‌దేళ్ల త‌ర్వాత హీరోయిన్ రీ ఎంట్రీ!

ప‌దేళ్ల త‌ర్వాత హీరోయిన్ రీ ఎంట్రీ!

మాజీ మిస్ యూనివ‌ర్స్ సుస్మితా సేన్ త‌ను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. దాదాపు ప‌దేళ్ల నుంచి ఈమె సినిమాల‌కు దూరంగా ఉంది. మ‌ధ్య‌లో ఒక చిన్న బెంగాళీ సినిమాలో మాత్ర‌మే న‌టించింది సుస్మిత. చివ‌ర‌గా బాలీవుడ్ సినిమా నో ఎంట్రీ లో ఈమె అగుపించింది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్టుగా సుస్మిత పేర్కొంది.

ఇది త‌న రౌండ్ టు అని సుస్మిత ఉత్సాహంగా ప్ర‌క‌టించింది. మిస్ యూనివ‌ర్స్ గా నిలిచిన వెంట‌నే సుస్మిత‌కు ఇండియ‌న్ సినిమాలో అవ‌కాశాలు వెల్లువెత్తాయి. ఒక‌టీ అర ద‌క్షిణాది సినిమాల్లో కూడా సుస్మిత న‌టించింది.

నాగార్జున స‌ర‌స‌న 'ర‌క్ష‌కుడు' సినిమాలో సుస్మితా సేన్ న‌టించింది. త‌మిళంలో రూపొందిన ఆ సినిమా తెలుగులోకి అనువాదం అయ్యింది. అయితే క‌మ‌ర్షియ‌ల్ గా అది స‌క్సెస్ కాలేదు. బాలీవుడ్ లో మాత్రం సుస్మిత‌కు కొన్ని క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ లు ల‌భించాయి. షారూక్ స‌ర‌స‌న న‌టించిన 'మై హూనా' కూడా అందులో ఒక‌టి. మ‌రి సెకెండ్ ఇన్నింగ్స్ లో ఈ బెంగాళీ భామ ఏ మేర‌కు స‌త్తా చాటుతుందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?