cloudfront

Advertisement


Home > Movies - Movie News

వజ్రాల వ్యాపారంలోకి క్రేజీ హీరోయిన్

వజ్రాల వ్యాపారంలోకి క్రేజీ హీరోయిన్

హీరోలు వ్యాపారం చేయడం కొత్తకాదు. దాదాపు ప్రతి స్టార్ హీరోకు సైడ్ బిజినెస్ లు ఉన్నాయి. అయితే హీరోయిన్లు వ్యాపార రంగంలో కొనసాగడం మాత్రం కాస్త తక్కువ. ప్రతి హీరోయిన్ కు ఇది చేతకాదు. కానీ తమన్న మాత్రం చేసి చూపిస్తానంటోంది. ఏకంగా వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టబోతోంది. 

అవును.. డైమండ్ జ్యూవెలరీ లైన్ ను ప్రారంభించబోతున్నానని ప్రకటించింది మిల్కీబ్యూటీ. దీనికి ఆమె డేట్ కూడా ఫిక్స్ చేసింది. వినాయక చవితి రోజున తమన్న డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ ను ఆవిష్కరిస్తానని ప్రకటించింది. తల్లిదండ్రులకు తను ఇచ్చే కానుక ఇదే అంటోంది.

వ్యాపారం రంగంలో కొనసాగుతున్న తారలు చాలామంది ఉన్నారు. కానీ ఇలా వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న హీరోయిన్ మాత్రం సౌత్ నుంచి తమన్న మాత్రమే. బాలీవుడ్ లో కరీనాకపూర్, కత్రినాకైఫ్ కు కొన్ని డైమండ్ జ్యావెలరీ బ్రాండ్స్ లో వాటాలున్నాయంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. అది నిజమే అయినా, వాళ్లు తమ పేరు మీద బ్రాండ్స్ ను ప్రవేశపెట్టలేదు. ఇలా చూసుకుంటే సొంత పేరు మీద డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ పెట్టిన తొలి హీరోయిన్ గా తమన్న నిలిచిపోతుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో వెంకీ సరసన ఎఫ్-2 అనే సినిమా చేస్తోంది. మరోవైపు ఆమె నటించిన దటీజ్ మహాలక్ష్మి (క్వీన్ రీమేక్) విడుదలకు సిద్ధమైంది. అటు కోలీవుడ్ లో కూడా తమన్న చేతిలో 2 సినిమాలున్నాయి. సినిమాలతో పాటు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.