cloudfront

Advertisement


Home > Movies - Movie News

నాకు నిశ్చితార్థం అయిందనుకున్నారు

నాకు నిశ్చితార్థం అయిందనుకున్నారు

తన కెరీర్ లో ఎదుర్కొన్న మొట్టమొదటి గాసిప్ ను బయటపెట్టింది హీరోయిన్ తమన్న. కెరీర్ స్టార్టింగ్ లో తనచేతికి ఉన్న ఉంగరాన్ని చూసి చాలామంది తనకు నిశ్చితార్థం అయిపోయిందని అనుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో బయట వ్యక్తుల కంటే, ఇండస్ట్రీ జనాలకు వివరణ ఇచ్చుకోవడానికే చాలా టైమ్ పట్టినట్టు తెలిపింది.

"నా మొదటి పారితోషికంతో ఓ రింగ్ కొనుక్కున్నాను. కానీ అది చేతికి పెట్టుకున్న తర్వాత తెలిసిందేంటంటే.. చూడ్డానికి అది నిశ్చితార్థం ఉంగరంలా కనిపిస్తుంది. చాలామంది అప్పట్లో రకరకాలుగా అనుకున్నారు కూడా. కానీ నా మొదటి జీతంతో కొనుక్కున్న రింగ్ అది. అందుకే చాన్నాళ్ల పాటు దాన్ని తీయలేదు. అలాగే వేలికి ఉంచుకున్నాను."

ఇలా తన కెరీర్ లో ఎదుర్కొన్న తొలి పుకారు గురించి చెప్పుకొచ్చింది తమన్న. తర్వాత తన జీవితంలో పుకార్లు కామన్ అయిపోయాయని, తనను ఎంతగానో బాధిస్తే తప్ప పుకార్లపై స్పందించనని స్పష్టంచేసింది. ఖామోషీ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన మిల్కీబ్యూటీ, 15 ఏళ్లకే పరిశ్రమలో చాలా చేదు అనుభవాలు చవిచూశానని చెప్పుకొచ్చింది.

"చాలా తక్కువ వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. ఎంతో ఎదిగాను. ఓ హీరోయిన్ కు ప్రతి శుక్రవారం చేదు అనుభవమే. సినిమా రిజల్ట్ తేడాకొడితే జాతకాలు మారిపోయే పరిశ్రమ ఇది. కొన్ని మంచి శుక్రవారాలు చూశాను. ఎన్నో చెడ్డ శుక్రవారాలు కూడా చూశాను."

తన కెరీర్ లో అత్యంత ఖరీదైన దుస్తుల్ని సైరా సినిమాలో వేసుకుంటున్నానని తెలిపింది తమన్న. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి సినిమాలో కూడా తను ఖరీదైన దుస్తులు వేసుకోలేదని, కానీ సైరాలో మాత్రం తనకు చాలా ఖరీదైన దుస్తులు డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది.

"ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్నాడు. ఇందులో నేను ధరించిన దుస్తులు అత్యంత ఖరీదైనవి. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చాలా వర్క్ చేసిన భారీ కాస్ట్యూమ్ అది. వీటిలో కొన్నింటిని చిరంజీవి కూతురు డిజైన్ చేయగా, మరికొన్నింటిని డిజైనర్ అంజూ మోదీ డిజైన్ చేశారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇంత ఖరీదైన దుస్తులు ఎప్పుడూ ధరించలేదు."

బాహుబలి ప్రాజెక్టును తన దృష్టిలో అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకొచ్చిన తమన్న.. ఆ తర్వాత స్థానంలో సైరా సినిమా నిలుస్తుందని, ఇలా రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో తను భాగంకావడం ఆనందంగా ఉందని తెలిపింది.

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్