Advertisement


Home > Movies - Movie News
ఒకేసారి క్లారిటీ ఇచ్చిన తమన్న, రకుల్

మొన్నటివరకు ఈ ముద్దుగుమ్మలపై రెండు పుకార్లు షికారు చేశాయి. వాటిలో ఒకటి నిజమైతే, మరొకటి అబద్ధమని తేలిపోయింది. వీటిలో ఒకటి చిరంజీవి సైరా సినిమాకు సంబంధించింది కాగా, మరొకటి నాగచైతన్య సినిమాకు చెందిన వార్త. ఈ రెండు ప్రచారాలపై రకుల్ ప్రీత్ సింగ్, తమన్న స్పందించారు.

సైరా సినిమాలో తమన్న నటించనుందనే ప్రచారం కొన్ని రోజులుగా నలుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రచారంలో ఉన్న ఎన్నో వార్తల్లో ఇది కూడా ఒకటి. ఎట్టకేలకు దీనిపై మిల్కీబ్యూటీ క్లారిటీ ఇచ్చింది. తను చిరంజీవి సరసన నటించబోతున్నట్టు స్పష్టంచేసింది. ఒకే సినిమాలో చిరంజీవి, అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అరుదైన అవకాశం తనకు మాత్రమే దక్కినట్టు చెప్పుకొచ్చింది తమన్న.

తమన్న స్టేట్ మెంట్ తో సైరా సినిమాకు సంబంధించి ఓ పుకారుకు తెరపడింది. ఇక తేలాల్సిన మరో అంశం సంగీత దర్శకుడు మాత్రమే. ఈ సినిమాకు ఓ బాలీవుడ్ సంగీత దర్శకుడు (అమిత్ త్రివేది) సంగీతం అందించబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై కూడా రేపోమాపో ఓ క్లారిటీ రానుంది.

ఇక రకుల్ కు సంబంధించి కూడా ఓ పుకారుపై  క్లారిటీ వచ్చింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి సినిమాలో రకుల్ స్పెషల్ సాంగ్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. అలాంటిదేం లేదంటూ క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. చైతూ సినిమాలో తను స్పెషల్ సాంగ్ చేయడం లేదని ట్వీట్ చేసింది.