సమంత హోస్ట్ గా ఓటిటి ప్లాట్ ఫారమ్ మీద శామ్ జామ్ అంటూ ఓ షో ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్ ఫ్లాప్ షో అనిపించుకుంది. జనం పెదవి విరిచారు. సో మెనీ థింగ్స్ ఎట్ ఎ టైమ్ అన్నట్లు, రకరకాల షో ల ను కలిపేసి కలగూర గంప అనిపించుకుంది ఆ ఎపిసోడ్.
దీంతో రెండో ఎపిసోడ్ విషయంలో జాగ్రత్త పడ్డారు. రెగ్యులర్ టాక్ షో ల మాదిరిగా కేవలం చిట్ చాట్ మీదనే కాన్సన్ ట్రేట్ చేసారు. రానా, నాగ్ అశ్విన్ లు గెస్ట్ లుగా హాజరైన ఈ షో లో ఎటువంటి అదనపు వ్యవహారాల జోలికి పోలేదు.
హర్షను పానకంలో పుడక టైపు ఎగస్ట్రా కామెడీకి స్వస్తి చెప్పారు. సంఘ సేవ, సమాజ సేవ లాంటి వ్యవహారాలను చిట్ చాట్ మధ్యలో చొప్పించి, బోర్ కొట్టించే వ్యవహారాలకు స్వస్తి చెప్పారు.
గతంలో మంచు లక్ష్మి, రానా తదితరులు చేసిన మాదిరిగా సింపుల్ గా ఓ చిట్ చాట్ మాదిరిగా, రెగ్యులర్ ఇంటర్వ్యూల మాదిరిగానే సమంత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎపిసోడ్ లో రానా తొలిసారిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా వివరంగా మాడ్లాడారు.