cloudfront

Advertisement


Home > Movies - Movie News

తాప్సి కాస్టింగ్ కౌచ్.. డేటింగ్ చేసినా చెప్పనుగా..

తాప్సి కాస్టింగ్ కౌచ్.. డేటింగ్ చేసినా చెప్పనుగా..

టాలీవుడ్ ను కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ పై రోజుకో హీరోయిన్, ఒక్కో విధంగా రెస్పాండ్ అవుతోంది. మొన్నటికిమొన్న కాస్టింగ్ కౌచ్ చేస్తే తప్పేంటి అనే అర్థం వచ్చేలా రష్మి మాట్లాడింది. ఇప్పుడు హీరోయిన్ తాప్సి వంతు. ఈమె ఏకంగా తనకు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడే అర్హత లేదంటోంది. 

"అదృష్టమో, దురదృష్టమో కానీ నాకు కాస్టింగ్ కౌచ్ అనుభవాల్లేవ్. దురదృష్టం అని ఎందుకన్నానంటే నాక్కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవంలోకి వచ్చి ఉంటే నేను చాలా బాగా మాట్లాడేదాన్ని. పింక్ మూవీ తర్వాత మహిళా సమస్యలపై నేను మాట్లాడతానని చాలామంది ఎదురుచూస్తున్నారు. సో.. కాస్టింగ్ కౌచ్ పై నేను మాట్లాడితే బాగుంటుంది. కానీ నాకు అది అనుభవంలోకి రాలేదు కదా."

ఇలా కాస్టింగ్ కౌచ్ పై రియాక్ట్ అవ్వకుండా తప్పించుకుంది తాప్సి. కెరీర్ స్టార్టింగ్ లోనే పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లు తగలడంతో ఎవరూ తన దగ్గర పిచ్చివేషాలు వేయలేదంటోంది.

"నాకు అలాంటి అనుభవాలు లేకపోవడానికి ఓ రీజన్ ఉంది. పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలతో నా సినీప్రయాణం ప్రారంభమైంది. దాంతో తర్వాత నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ఎవరూ సాహసించలేదు. అది నాకు కలిసొచ్చింది. భవిష్యత్తులో కూడా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడే అవకాశం నాకు రాదేమో." 

ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివరాలు చెప్పడానికి నిరాకరించింది తాప్సి. ఒకవేళ డేటింగ్ చేసినా చెప్పనంటోంది. ఎందుకంటే, అలా చెప్పడం వల్ల కష్టపడి చేస్తున్న సినిమాల గురించి చెప్పడం మానేసి, డేటింగ్ విషయాలే హెడ్ లైన్స్ అయిపోతున్నాయని అంటోంది తాప్సి.