Advertisement

Advertisement


Home > Movies - Movie News

కమాన్ ట్రోల్ మి.. తిడితే ఇష్టమంటున్న హీరోయిన్

కమాన్ ట్రోల్ మి.. తిడితే ఇష్టమంటున్న హీరోయిన్

ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైపోయింది తాప్సి. అక్కడామెకు క్రేజ్ ఉంది. అయితే సౌత్ సినిమాను తను వదులుకోనంటోంది ఈ పంజాబీ బ్యూటీ. కానీ ఇప్పటికీ సౌత్ నుంచి 3 పాటలు, 5 సీన్లు ఉండే పాత్రలే వస్తున్నాయంటోంది. అందుకే పెద్ద హీరోల సినిమాలైనప్పటికీ వాటిని వదులుకుంటున్నానని స్పష్టంచేసింది.

"సౌత్ లో గతేడాది గేమ్ ఓవర్ చేశాను. అది తెలుగు-తమిళ భాషల్లో రిలీజైంది. సౌత్ లో ప్రతి ఏటా ఓ సినిమా చేయాలనుకుంటాను. కానీ సమస్య ఏంటంటే.. ఎక్కువగా అక్కడ (సౌత్ లో) గ్లామర్ రోల్స్ చేయడం వల్ల 3 పాటలు, 5 సీన్లు ఉండే పాత్రలే వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమా ఆఫర్లే అవి. అయినప్పటికీ అలాంటివి చేయను."

అలా అని కథ మొత్తం తన చుట్టూరా తిరగాలని కోరుకోవడం లేదు తాప్సి. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినప్పటికీ తన పాత్రకు వెయిట్ ఉండే చేస్తానంటోంది. చిన్న పాత్ర చేసినా బలంగా ఉండాలంటోంది. ఇక ట్రోలింగ్స్ పై స్పందిస్తూ.. ట్రోలింగ్స్ ను ఎంజాయ్ చేస్తానంటోంది.

"నన్ను ట్రోల్ చేస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనలో మేటర్ ఉన్నప్పుడే కదా మనల్ని ట్రోల్ చేస్తారు. మనపై అందరి దృష్టి ఉంటేనే కదా మనం ట్రోలింగ్ కు గురవుతాం. కాబట్టి అది ఎంజాయ్ చేయాల్సిన విషయమే. అందరూ నన్ను తిడుతున్నారంటే నా జీవితంలో మేటర్ ఉన్నట్టే కదా."

లాక్ డౌన్ ముగిసిన వెంటనే మొట్టమొదట చేసే పని గురించి చెప్పుకొచ్చింది తాప్సి. అర్జెంట్ గా ఓ జపనీస్ రెస్టారెంట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాలనుకుంటోంది. జపనీస్ రుచులంటే ఆమెకు ఇష్టం అంట. ఈ లాక్ డౌన్ వల్ల వాటిని బాగా మిస్ అవుతోందట. 

మన పాలన-మీ సూచన, 4వ రోజు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?