cloudfront

Advertisement


Home > Movies - Movie News

దేవరకొండ కోసం తరుణ్ మేకోవర్

దేవరకొండ కోసం తరుణ్ మేకోవర్

పెళ్లిచూపులు సినిమాతో హీరో విజయ్ దేవరకొండకు బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు అదే దర్శకుడ్ని లీడ్ రోల్ లో పెట్టి విజయ్ దేవరకొండ ఓ సినిమా నిర్మిస్తున్నాడు. కాస్త గమ్మత్తుగా అనిపించినప్పటికీ అది నిజం. విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో సినిమా స్టార్ట్ అయింది. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమా కోసం తరుణ్ భాస్కర్ మేకోవర్ కూడా అయ్యాడు.

మొన్నటివరకు కాస్త లావుగా గడ్డం, మీసంతో ఉన్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు లుక్ మార్చాడు. క్లీన్ షేవ్ చేశాడు. గడ్డం, మీసం తీసేశాడు. జుట్టు కాస్త పెంచుతున్నాడు. బరువు తగ్గే పనిలో కూడా బిజీగా ఉన్నాడు. మిఠాయి ఆడియో లాంఛ్ లో ఇలా సరికొత్తగా కనిపించాడు తరుణ్.

కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ మెంట్ అనే బ్యానర్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ఈ ప్రొడక్షన్ హౌజ్ పై తొలి ప్రయత్నంగా తనకు బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తున్నాడు. షమ్మీర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. అన్నట్టు ఈ సినిమాకు "మీకు మాత్రమే చెప్తా" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫిలింఛాంబర్ లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది.

తరుణ్ భాస్కర్ కు కెమెరా కొత్తకాదు. 2-3 చిన్న పాత్రలు చేశాడు. ఫలక్ నుమా దాస్ అనే సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా లీడ్ రోల్ పోషించే స్థాయికి ఎదిగాడు. అయితే అవకాశాలొస్తున్నాయి కాబట్టి చేస్తున్నానని, తన మొదటి ప్రాధాన్యం దర్శకత్వానికే అంటున్నాడు తరుణ్ భాస్కర్.

నాకు ఆవిడంటే చాలా ఇష్టం : వీరమాచినేని 

నాకు స్టామినా చాలా ఎక్కువ