cloudfront

Advertisement


Home > Movies - Movie News

కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చిన దేవరకొండ

కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చిన దేవరకొండ

అర్జున్ రెడ్డి తర్వాత అఫీషియల్ గా విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా టాక్సీవాలా. మధ్యలో వచ్చిన ఓ సినిమా తనకు బ్యాక్ లాగ్ లాంటిదని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని స్వయంగా అతడే చెప్పుకొచ్చాడు. అలా అర్జున్ రెడ్డి తర్వాత మూవీగా టాక్సీవాలాకు మంచి హైప్ వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని కూడా దేవరకొండే స్పష్టంచేశాడు.

లెక్కప్రకారం.. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రావాలి టాక్సీవాలా. కానీ మూవీ వచ్చే నెలకు వాయిదాపడినట్టు ప్రకటించాడు విజయ్ దేవరకొండ. దీనికి అతడు సరైన రీజన్ కూడా చెప్పలేదు.

"మై రౌడీస్.. నేను 18కి రావట్లేదు. గట్టిగా అరవడానికి, బిగ్గరగా నవ్వడానికి, భయపడ్డానికి రెడీగా ఉండండి. కాకపోతే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయండి. సినిమాకు ఫైనల్ టచ్ ఇస్తున్నాం. జూన్ లో ఏ తేదీకి వస్తున్నామనే విషయాన్ని మరో వారంలో వెల్లడిస్తాం."

ఇలా సినిమా పోస్ట్ పోన్ అయిందనే విషయాన్ని బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. నిజానికి టాక్సీవాలా చెప్పిన టైమ్ కు రాదనే విషయం ముందే అందరికీ తెలుసు. ఎందుకంటే అర్జున్ రెడ్డి టైపులోనే ఇది కూడా ఓ ప్రయోగాత్మక చిత్రం. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి.

మహానటి, భరత్ అనే నేను, నా పేరు సూర్య లాంటి సినిమాలతో థియేటర్లన్నీ ప్యాక్ అయిన ఈ టైమ్ లో ఇలాంటి సినిమాను విడుదల చేయడం అంటే చేతులు కాల్చుకోవడమే. అందుకే వచ్చే నెలకు వాయిదా వేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ 1కి ఈ సినిమా రిలీజ్ అవుతుంది.