Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్పీకర్ పదవికి నీతులు టీడీపీనే చెప్పాలి!

స్పీకర్ పదవికి నీతులు టీడీపీనే చెప్పాలి!

ఉన్నట్టుండి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీద పడింది తెలుగుదేశం పార్టీ. స్పీకర్ కు ఎనలేని నీతులు చెబుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్లు. ఇటీవల స్పీకర్ కొన్ని రాజకీయ వ్యాఖ్యానాలు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎక్కడ లేని నీతులన్నీ తెచ్చుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లు అనవిగాని నీతులు చెప్పారు.

ఇక స్పీకర్ ను తీవ్రంగా దూషిస్తూ.. ఆయనపై బూతులు వాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్ సైట్లో ఒక కథనాన్ని పోస్టు చేశారట. అందులో తమ్మినేనిని తీవ్రంగా దూషించినట్టుగా తెలుస్తోంది.

అయినా స్పీకర్ పదవికి నీతులు చెప్పే అర్హత తెలుగుదేశం పార్టీకి ఎంత వరకూ ఉంది? అనేది కనీసం ఆలోచించుకోవాల్సిన అంశం. స్పీకర్ వ్యవస్థను అత్యంత దారుణంగా తయారు చేసిన ఘనత నిస్సందేహంగా చంద్రబాబు నాయుడిదే. గత ఐదేళ్ల పరిణామాలే అందుకు సాక్ష్యం. అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు.. ఫక్తు రాజకీయ నేతలా వ్యవహరించారు.

చంద్రబాబు నాయుడు కొనుక్కొచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుచుకున్న స్పీకర్ గా కోడెల నిలిచారు. అంతటితో కూడా ఆయన ఆగలేదు. ప్రతిపక్ష పార్టీ నేతలను నిందించడం మొదలుపెట్టారు. వారిపై రాజకీయ విమర్శలు చేశారు. 

స్పీకర్ గా ఉంటూ రాజకీయ విమర్శలు చేసిన కోడెల ఏ పాటి నిస్పాక్షింగా వ్యవహరించి ఉంటారో అంచనా వేయవచ్చు. ఆపై తన కుల వనభోజనాలకు హాజరై తమ కులమే ఎప్పటికీ అధికారంలో ఉండాలంటూ పిలుపునిచ్చారు కోడెల. అలాగే తను  గెలవడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని ప్రకటించి కేసులను కూడా ఎదుర్కొన్నారు ఆయన.

అత్యంత వివాదాస్పద స్పీకర్ గా నిలిచిన కోడెల, అధికారం కోల్పోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయన కూతురు, కొడుకు నాడు పాల్పడిన అక్రమాలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్నారు.

అలాంటి స్పీకర్ ను ముందు పెట్టుకు సాగిన తెలుగుదేశం పార్టీ వాళ్లు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్పీకర్ కు చెబుతున్న శుద్దులు ఉంటే.. నవ్విపోదరుగాకా, తెలుగుదేశానికేంటి సిగ్గు అనాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?