cloudfront

Advertisement


Home > Movies - Movie News

కాస్త ఆలస్యంగా వస్తున్న మెగా హీరో

కాస్త ఆలస్యంగా వస్తున్న మెగా హీరో

సాయిధరమ్ తేజ్, కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా తేజ్ ఐ లవ్ యు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను వాయిదా వేశారు. లెక్కప్రకారం ఈ సినిమా ఈనెల 29న విడుదల కావాలి. కానీ జులై మొదటి వారానికి పోస్ట్ పోన్ చేశారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్లనే సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సెలబ్రేట్ చేశారు. ఈ నెలాఖరుకు వస్తున్నామని అప్పుడే గ్రాండ్ గా ప్రకటించారు. ఇంతలోనే వారం రోజులు వాయిదా పడింది 'తేజ్ ఐ లవ్ యు'.

అన్నీ అనుకున్నట్టు జరిగితే సాయిధరమ్ తేజ్ కు ఈసారి సోలో రిలీజ్ దక్కే ఛాన్స్ ఉంది. జులై మొదటివారంలో గోపీచంద్ నటించిన పంతం సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తేదీ నుంచి పంతం దాదాపు తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో మరో సినిమా రంగంలోకి రాకుండా ఉంటే తేజూ ఒక్కడే థియేటర్లలోకి వస్తాడన్నమాట.

కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీత దర్శకత్వం వహించాడు.