Advertisement

Advertisement


Home > Movies - Movie News

బుల్లితెరపై మాత్రం హీరో అనిపించుకున్నాడు

బుల్లితెరపై మాత్రం హీరో అనిపించుకున్నాడు

జాంబీ రెడ్డి అనే సినిమా తేజ సజ్జను సిల్వర్ స్క్రీన్ పై పూర్తిస్థాయి హీరోగా ప్రజెంట్ చేయలేకపోయింది. అటు జాంబీ జానర్ కు తక్కువ, తెలుగు సినిమాకు ఎక్కువ అన్నట్టు తయారైంది ఆ మూవీ. ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడిదే సినిమా తేజను బుల్లితెరపై మాత్రం హీరోను చేసి పడేసింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేస్తే 9.66 టీఆర్పీ వచ్చింది. ఓ కొత్త హీరోకు ఈ రేంజ్ రేటింగ్ అంటే పెద్ద విశేషమే.

తేజ సజ్జ ఇప్పుడు హీరోగా మారి ఉండొచ్చు. కానీ ప్రేక్షకులకు మాత్రం ఈ అబ్బాయి కొత్త కాదు. బాలనటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ. ఆ తర్వాత సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాకు కూడా మంచి రేటింగ్ వచ్చింది.

ఇవన్నీ కలిసి తేజను బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?