cloudfront

Advertisement


Home > Movies - Movie News

తెలుగమ్మాయితో విశాల్ పెళ్లి?

తెలుగమ్మాయితో విశాల్ పెళ్లి?

ప్రభాస్ పెళ్లి ఇక్కడ హాట్ టాపిక్. కోలీవుడ్ లో మాత్రం విశాల్ పెళ్లి హాట్ టాపిక్. ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా.. ఎవర్ని పెళ్లి చేసుకుంటాడా అని కోలీవుడ్ జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ లానే ఎప్పటికప్పుడు తన పెళ్లిని వాయిదావేస్తూ వస్తున్న విశాల్.. ఈసారి ఓ సరికొత్త పెళ్లికబురు మోసుకొచ్చాడు.

అవును.. ఓ తెలుగమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట విశాల్. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికీ కోలీవుడ్ లో వైరస్ లా వ్యాపిస్తున్న పుకారు ఇది. 40 ఏళ్ల విశాల్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. నిజానికి ఇందులో పెద్దగా ఆశ్చర్యపడ్డానికి కూడా ఏం లేదు. ఎందుకంటే చెన్నైలో పుట్టిపెరిగినప్పటికీ, విశాల్ కుటుంబీకులు తెలుగువాళ్లే. 

గతంలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో లవ్ ఎఫైర్ సాగించాడు విశాల్. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ శరత్ కుమార్ తో విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. అలా విడిపోయినప్పట్నుంచి పెళ్లికి ఆమడదూరంలో ఉంటున్నాడు విశాల్. 

రీసెంట్ గా అభిమన్యుడు ప్రమోషన్స్ లో భాగంగా విశాఖలో పర్యటించిన విశాల్ ను పెళ్లిపై ప్రశ్నించింది తెలుగు మీడియా. అయితే కాలమే సమాధానం చెబుతుందన్నట్టు సైగ చేసి తప్పించుకున్నాడు. అభిమన్యుడు పేరుచెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటించడం, తెలుగమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు రావడం చూస్తుంటే.. కొంత నిజం ఉందనే అనుకోవాలి.