cloudfront

Advertisement


Home > Movies - Movie News

నన్ను ఏ దర్శకుడు లిప్ కిస్ అడగలేదు

నన్ను ఏ దర్శకుడు లిప్ కిస్ అడగలేదు

కథ డిమాండ్ చేస్తే లిప్ కిస్సులు పెట్టడానికి రెడీ... ఏ హీరోయిన్ అయినా కామన్ గా చెప్పే ఆన్సర్ ఇది. మరికొందరు హీరోయిన్లు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తాము లిప్ కిస్సులకు అంగీకరించమని కరాఖండిగా చెప్పేస్తుంటారు. అయితే తమన్నా మాత్రం ఈ రెండు కేటగిరీల్లోకి రాదు. మిల్కీబ్యూటీ వ్యవహారమంతా రివర్స్ లో ఉంది.

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బోల్డ్ కంటెంట్ వస్తోందని, ఇది చాలామంది మార్పు అని అంటోంది తమన్న. తను కూడా అలాంటి బోల్డ్ సినిమాల్లో నటించాలనుకుంటున్నానని కానీ ఇంతవరకు అలాంటి కథలు రాలేదని అంటోంది. బోల్డ్ అంటే లిప్ కిస్సులకు ఓకేనా అని మీడియా ప్రశ్నిస్తే, "అదే కదా నేను చెబుతోంది" అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది.

ఇప్పటివరకు తెలుగులో తనను ఏ దర్శకుడు లిప్ కిస్ కోసం డిమాండ్ చేయలేదని, ఇప్పుడు టాలీవుడ్ లో కథల ఫార్మాట్ మారింది కాబట్టి, రాబోయే రోజుల్లో ఎవరైనా లిప్ కిస్ అడుగుతారని వెయిటింగ్ అంటోంది తమన్న. అయితే ఇక్కడ కూడా అందరు హీరోయిన్లు చెప్పేమాటే చెబుతోంది. కథ డిమాండ్ చేయాలట.

తన అప్ కమింగ్ మూవీ "నెక్ట్స్ ఏంటి" లో లిప్ కిస్సులు లేవన్న తమన్న, మూవీ మాత్రం రొమాంటిక్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ తరం కుర్రాళ్లంతా తన క్యారెక్టర్ ను లైక్ చేస్తారని అంటోంది.

తమన్నాఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్