cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

కియరా పాట ఎలా ఉంది.. యాజ్ ఇటీజ్ ఉంది

కియరా పాట ఎలా ఉంది.. యాజ్ ఇటీజ్ ఉంది

ఓ సినిమాలో మ్యూజిక్ డైరక్టర్ గా నటించిన బ్రహ్మానందం.. ఓ ట్యూన్ కంపోజ్ చేసి ఎలా ఉందని పక్కనే ఉన్న అసిస్టెంట్ ను అడుగుతాడు. యాజ్ ఇటీజ్ ఉంది సర్ అంటాడు అసిస్టెంట్. అంటే హిట్ సాంగ్ ను యథాతథంగా కాపీ కొట్టారనేది అసిస్టెంట్ ఇన్నర్ మీనింగ్. సరిగ్గా ఇప్పుడీ సీన్ ను కియరా అద్వానీ కొత్త సినిమాను అన్వయించుకోవచ్చు.

కెరీర్ లో కియరా అద్వానీ చేసిన ఫుల్ లెంగ్త్ డాన్స్ నంబర్ గా రిలీజ్ కు ముందే ఈ పాటకు క్రేజ్ వచ్చింది. అలా భారీ అంచనాల మధ్య కొద్దిసేపటి కిందట విడుదలైన ఆ పాట విని ఆశ్చర్యపోవడం తెలుగు ప్రేక్షకుల వంతయింది. ఎందుకంటే.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్ ఇది. దాన్ని యాజ్ ఇటీజ్ కాపీ కొట్టేశారు.

రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమాలోని 'చూపులతో గుచ్చిగుచ్చి చంపకే' అనే పాట ట్యూన్ ను ఇలా కియారా కొత్త సినిమా కోసం వాడేశారు. ఈ ఘనత సొంతం చేసుకున్న ఆ వ్యక్తి, మ్యూజిక్ డైరక్టర్ మికా సింగ్. ఆ సినిమా పేరు ఇందూ కి జవానీ.

కియరా తెలుగులో కూడా పాపులర్ అనే విషయం తెలిసిందే. అందుకే ఆమె డాన్స్ నంబర్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. తీరా పాట రిలీజైన తర్వాత అది ఇడియట్ సినిమా సాంగ్ అవ్వడంతో ఖంగుతిన్నారు. ఓవైపు కియరా అందాలు, ఆమె స్టెప్పుల్ని మెచ్చుకుంటూనే.. మరోవైపు తెలుగు పాటను కాపీ కొట్టినందుకు తిట్టుకుంటున్నారు జనం.

 


×