cloudfront

Advertisement


Home > Movies - Movie News

తెరవెనుక హ్యాపీ అంటోన్న ఛార్మి

తెరవెనుక హ్యాపీ అంటోన్న ఛార్మి

నటిగా ప్రముఖ హీరోలతో, పెద్ద సినిమాలలో నటించిన ఛార్మి నెమ్మదిగా తెరమరుగయింది. జ్యోతిలక్ష్మి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న ఛార్మికి ఆ చిత్రంతో ఆశించిన ఫలితం దక్కకపోవడంతో మళ్లీ కెమెరా ముందుకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు. పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనక్ట్స్‌లో భాగస్వామిగా చేరి నిర్మాణ బాధ్యతలతో తనని తాను బిజీగా వుంచుతోంది.

దర్శకత్వం వహిస్తూ నిర్మాణ వ్యవహారాలు చక్కబెట్టుకోలేక, నమ్మకమైన మనిషి లేక ఇబ్బంది పడిన పూరి కూడా ఛార్మి రాకతో కంఫర్టబుల్‌ అయిపోయాడు. పూరి సెట్లో ఛార్మి చెప్పిందే వేదమని అంటారు. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో అన్నీ ఛార్మి డిసైడ్‌ చేస్తోందట. తన భాగస్వామ్యంలో పూరికి విజయాలు రాకపోయినా కానీ ఇస్మార్ట్‌ శంకర్‌తో మునుపటి వైభవం వస్తుందనే ఛార్మి ఆశిస్తోంది.

నిజానికి పూరితో పని చేయడానికి హీరోలంతా వెనకాడుతోన్న దశలో రామ్‌ డేట్లు ఇప్పించింది ఛార్మీనేనట. మళ్లీ నటిగా ఎంట్రీ ఇచ్చే ఆలోచన వుందా అంటే, నటన నుంచి పూర్తిగా రిటైరైపోయానని ఛార్మి చెబుతోంది. పెళ్లి ఆలోచన కూడా లేనట్టే కనిపిస్తోన్న ఛార్మి ప్రస్తుతానికి సినిమాల నిర్మాణంపైనే దృష్టి పెట్టింది. కొన్నాళ్ల తర్వాత వేరే బిజినెస్‌లు కూడా చేసే ఆలోచన వుందని చూచాయగా చెబుతోంది.