Advertisement

Advertisement


Home > Movies - Movie News

థాంక్యూ సినిమాను ఓటిటికి ఇద్దామనుకున్నారా?

థాంక్యూ సినిమాను ఓటిటికి ఇద్దామనుకున్నారా?

ఇదో ఇంట్రస్టింగ్ పాయింట్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా థాంక్యూ. మనం, 24 లాంటి మంచి మంచి సినిమాలు అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకుడు. 

నాగ్ చైతన్య హీరో. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయిపోయింది. విడుదల కావాల్సింది. కానీ లేట్ అవుతూ వచ్చింది. ఆఖరికి జూలై రెండో వారంలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఇంట్రస్టింగ్ గ్యాసిప్ ఏమిటంటే, ఈ సినిమాను అవుట్ రేట్ గా ఓటిటి ఇవ్వాలని నిర్మాత దిల్ రాజు అనుకున్నారట. కానీ దాని వల్ల మళ్లీ విమర్శలు వస్తాయని ఆగిపోయినట్లు తెలుస్తోంది. 

దిల్ రాజు ఓటిటికి ఇవ్వాలనుకున్నది కొన్ని నెలల కిందట అంట. అప్పుడు టికెట్ రేట్లు, థియేటర్ పరిస్థితులు సరిగ్గా లేవు.

గతంలో వి సినిమాను ఇలాగే అవుట్ రేట్ కు ఓటిటికి ఇచ్చేసారు. కానీ అప్పుడు కోవిడ్ పరిస్థితులు వున్నాయి. కానీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది అంతా. టికెట్ రేట్లు కూడా వచ్చేసాయి. అందువల్ల ఇప్పుడు ఓటిటి కి ఇస్తే బాగుండదని దిల్ రాజు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

థాంక్యూ అన్నది విక్రమ్ కే కుమార్ స్టయిల్ క్లాసిక్ సినిమా. జీవితంలో ఎదుగుదల అంతా తన గొప్పతనమే అనుకుని, ఎవర్నీ లక్ష్యపెట్టని యువకుడు, ఒక్కసారిగా మారి, తనకు జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత సాయం చేసిన వాళ్లందరినీ వెదుక్కుంటూ వెళ్లి థాంక్స్ చెప్పుకుంటూ రావడం అన్నది కోర్ పాయింట్ గా తెలుస్తోంది.

గతంలో ఆటోగ్రాఫ్ సినిమాలో ఇలాంటి జర్నీనే డిఫరెంట్ రీజన్ తో వుంటుంది. థాంక్యూ సినిమాలో అవిక గౌర్ ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఆమె ఎపిసోడ్ చాలా హార్ట్ టచింగ్ గా వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మారో..మారో అనే ఓ పాట విడుదలయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?