cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

గంటల వ్యవథిలో దొంగను పట్టుకున్న 'మాస్టర్'

గంటల వ్యవథిలో దొంగను పట్టుకున్న 'మాస్టర్'

ఊహించని విధంగా నిన్న సాయంత్రం మాస్టర్ సినిమా లీక్ అయిన సంగతి తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తి ఏకంగా 45 నిమిషాల ఒరిజినల్ ఫూటేజ్ ను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశాడు. అయితే ఆ వెంటనే విజయ్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు.

సినిమా యూనిట్ తో పాటు, విజయ్ ఫ్యాన్స్ అంతా కలిసి గంటల వ్యవథిలో ఆన్ లైన్ నుంచి మాస్టర్ మూవీని సక్సెస్ ఫుల్ గా తొలిగించగలిగారు. దీనికి తోడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన విజ్ఞప్తి కూడా బాగా కలిసొచ్చింది.

ఇదిలా ఉండగా.. ఆన్ లైన్ నుంచి మాస్టర్ మూవీని తొలిగించడమే కాకుండా.. ఆ మూవీని అప్ లోడ్ చేసిన వ్యక్తిని కూడా గంటల వ్యవథిలో పట్టుకోగలిగారు. మూవీ యూనిట్ ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగడంతో పాటు.. సమాంతరంగా విజయ్ ఫ్యాన్స్ లో ఉన్న  సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కొందరు రంగంలోకి దిగి నిందితుడ్ని పట్టుకున్నారు.

మాస్టర్ మూవీ ప్రింట్ ను ఓవర్సీస్ కు ట్రాన్సఫర్ చేయడానికి చెన్నైకి చెందిన ఓ కంపెనీకి ఆ పనులను అప్పగించారు. అక్కడ్నుంచే ఈ ఫూటేజ్ లీక్ అయినట్టు తెలుసుకున్నారు. అందులో పనిచేసే వ్యక్తి ఈ మూవీకి చెందిన 45 నిమిషాల క్లిప్ ను ఇంటర్నెట్ లో పెట్టినట్టు గుర్తించారు. వెంటనే అతడ్ని పోలీసులకు అప్పగించారు.

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాస్టర్ మూవీ రిలీజైంది. విజయ్ కెరీర్ లో 'మాస్టర్'పీస్ గా నిలుస్తుందనుకున్న ఈ సినిమా మొదటి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

 


×