cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇది అన్యాయం కదా బిగ్‌బాస్?

ఇది అన్యాయం కదా బిగ్‌బాస్?

ప్రేక్షకులు ఒక సైడ్ తీసుకునేలా, లేదా ఒక కంటెస్టెంట్‌పై సింపతీ చూపించేలా బిగ్‌బాస్‌లోకి వెళ్లేవారి ఎంపిక జరగకూడదు. ఎందుకంటే అది మిగతా కంటెస్టెంట్స్‌కి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఫెయిర్ గేమ్‌కి అవకాశం లేకుండా చేస్తుంది.

కానీ బిగ్‌బాస్ టీమ్ మంచీ, చెడూ ఆలోచించకుండా, ఫెయిర్ గేమ్ పాలసీ పక్కనబెట్టి ‘గంగవ్వ’ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించింది.

ఈ రియాలిటీ షో వృద్ధులకోసం డిజైన్ చేసినది కాదు. అందులోను గంగవ్వ అనేసరికి ప్రేక్షకులలో సింపతీ ఆటోమేటిగ్గా వుంటుంది. ఆమె హౌస్‌లో టాస్క్‌లు చేసినా లేకపోయినా సింపతీతో ప్రేక్షకులు ఓట్లు వేసేస్తారు. దీని వల్ల నిజంగా గేమ్ ఆడే కెపాసిటీ వున్న వాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ వీక్ నామినేషన్లలోనే ఈ విషయం స్పష్టమయింది.

ముప్పయ్ నుంచి నలభై శాతం ఓట్లు గంగవ్వకు పోల్ అవ్వగా, మిగతా ఓట్లను మిగిలిన వారు షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రతి వారం గంగవ్వను నామినేట్ చేయడమయితే జరుగుతూనే వుంటుంది. అలాగే ఆడియన్స్‌లో ఈ సింపతీ కూడా కంటిన్యూ అవుతూ వుంటుంది. దాని వల్ల ఫైనల్ 5కి అర్హత కలిగిన కొందరు కంటెస్టెంట్స్ ముందుగానే ఎలిమినేట్ అయ్యే అవకాశముంది.

టీఆర్పీలకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఆమెను పంపించి వుండొచ్చు కానీ మిగిలిన కంటెస్టెంట్స్‌కి డైరెక్ట్‌గా అన్యాయం జరిగే ఈ ఎంపిక సబబు కాదనే అభిప్రాయం తటస్థులలో వ్యక్తమవుతోంది.

కేసిఆర్ అడ్డాపై కన్ను

సినిమా మొత్తం న‌వ్వుతూనే ఉంటారు

 


×