Advertisement

Advertisement


Home > Movies - Movie News

రష్మికను పెళ్లాడాలంటే ఇదీ పద్ధతి!

రష్మికను పెళ్లాడాలంటే ఇదీ పద్ధతి!

రష్మిక లాంటి అమ్మాయిని చేసుకోవాలని అనుకోవడం సహజం. అయితే ఏకంగా రష్మికనే పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? రష్మికను పెళ్లాడాలంటే ప్రొసీజర్ ఏంటి? ఈ విషయాల్ని స్వయంగా రష్మిక బయటపెట్టింది. తనను పెళ్లాడాలని ఉందంటూ కోరికను బయటపెట్టిన ఓ కుర్రాడికి ఓపిగ్గా సమాధానం ఇచ్చింది.

"నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలని ఓ వ్యక్తి అడిగాడు. ఫస్ట్ నన్ను వచ్చి కలవాలి. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. ప్రొసీజర్ ఏంటో నేను అప్పుడు చెబుతాను. నన్ను ఎలా కలవాలో మా టీమ్ ను అడగండి. వాళ్లకు మెసేజ్ చేయండి."

గొప్పలకు పోకుండా, తనేదో స్వర్గం నుంచి కిందకు దిగొచ్చిన దేవతలా ఫీల్ అవ్వకుండా, స్టార్ అనే ఇగో లేకుండా.. ఇలా చాలా ప్రాక్టికల్ గా సమాధానం ఇచ్చింది రష్మిక. మనసులు కలవాలి, మనిషి ఎత్తుగా ఉండాలనే కోరికల చిట్టా విప్పకుండా ఇలా సింపుల్ గా కలిసి మాట్లాడుకుందామంటూ స్టేట్ మెంట్ ఇచ్చి అందరి మనసులు గెలుచుకుంది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైన రష్మిక.. సెట్స్ పైకి వెళ్లడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా చేయబోతోంది ఈ బ్యూటీ. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

కాపుల మధ్య కుల రాజకీయం

నందిగం సురేష్ ఫైర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?