cloudfront

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య నాకు తెలుసు.. మళ్లీ కెలికిన నాగబాబు

బాలయ్య నాకు తెలుసు.. మళ్లీ కెలికిన నాగబాబు

బాలయ్య తెలుసా అనే ప్రశ్నకు ఆయనెవరో తనకు తెలియదంటూ బాంబు పేల్చిన నాగబాబు ఇప్పుడు ఆ వివాదాస్పద ఎపిసోడ్ ను మళ్లీ కొనసాగించే ప్రయత్నం చేశారు. గత ఇంటర్వ్యూలో బాలయ్య గురించి అడిగితే పాతతరం బాలయ్య గురించి చెప్పిన నాగబాబు, ఈసారి మరో బాలకృష్ణను గుర్తుచేసి నందమూరి అభిమానుల్ని మరింత హర్ట్ చేశారు.

"మొన్న జరిగిన నా ఫేస్ బుక్ లైవ్ లో చిన్న తప్పు దొర్లింది. బాలకృష్ణ ఎవరు అని అడిగితే తెలియదు అనేశాను. అలా తెలియదు అనడం నా తప్పే. బాలయ్య అంటే తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. బాలయ్య మంచి నటుడు. ముఖ్యంగా ఆయన పెద్ద కమెడియన్. ఆయనంత కామెడీ చేసేవాళ్లు మనకు చాలా అరుదుగా ఉంటారు. బాలయ్య వెరీ గుడ్ కమెడియన్. ఎంతో హాస్యం చేస్తారు. ఆయన ఆంగిక అభినయం, పెర్ఫార్మెన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంత పెద్ద హాస్యనటుడు బాలకృష్ణ గారిని మరిచిపోయానని అనడం నా మిస్టేకే. పైగా ఆయన ఎన్టీఆర్ తో కూడా నటించిన కమెడియన్."

ఇలా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ... తను చెప్పే కమెడియన్ ఈయనే అంటూ వల్లూరి బాలకృష్ణ ఫొటో చూపించారు నాగబాబు. అప్పటితరం బాలయ్య మాత్రమే కాకుండా, ఈ బాలకృష్ణ కూడా తెలుసంటూ వ్యంగ్యంగా మరో వీడియో పోస్ట్ చేశారు.

"వల్లూరి బాలకృష్ణ అని వికీపీడియాలో కొడితే చాలా సమాచారం వస్తుంది. మరో విషాదకరమైన వార్త ఏంటంటే, ప్రస్తుతం బాలకృష్ణ మన మధ్య లేరు. ఆయన్ని మరిచిపోవడం పెద్ద తప్పే. బాలకృష్ణను గుర్తుచేసినందుకు చాలా థ్యాంక్స్."

3 రోజులుగా నలుగుతున్న వివాదాన్ని తాజా వీడియోతో ఇప్పుడు మరింత పెద్దది చేశారు నాగబాబు. దీంతో నందమూరి అభిమానులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే నాగబాబు చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇప్పుడు పుండుపై కారం చల్లినట్టు మరో బాలకృష్ణ గురించి ప్రస్తావిస్తూ, నాగబాబు ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేశారు. 

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?