cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

విజయ్‌ దేవరకొండ బ్రాండ్‌ సేల్‌ అయిపోతుందని అనుకున్నారు కానీ 'మీకు మాత్రమే చెప్తా' చిత్రానికి మరోసారి విజయ్‌ మార్కెటింగ్‌ ట్రిక్కులు పని చేయలేదు. తానే ఒక ప్రచార పాటని చేసి, కాళ్లరిగేలా ప్రచారం చేసినా కానీ ఈ చిత్రానికి అసలు బజ్‌ రాలేదు.

తొలి రోజే వీక్‌గా మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ జర్నీ ఆ తర్వాత కూడా అదే రీతిన సాగింది. విజయ్‌కి లాభాలు వచ్చినా కానీ థియేటర్‌ ఫీడింగ్‌కి కూడా ఈ చిత్రం దోహదపడలేదు.

కానీ విజయ్‌ మాత్రం ఏదో గొప్ప సినిమా తీసినట్టుగా గొప్పలు చెప్పుకోవాలని చూసాడు కానీ మరోసారి 'డియర్‌ కామ్రేడ్‌'కి ఫ్లాప్‌ తప్పలేదు.

దీంతో పాటే విడుదలైన రవిబాబు చిత్రం 'ఆవిరి' దర్శకుడిగా ఆవిరైపోయిన రవిబాబు ఐడియాలకి అద్దం పట్టినట్టు అనిపించింది.

ఈ చిత్రానికి కనీసం పోస్టర్లు అతికించిన ఖర్చులు కూడా రానంత దారుణంగా ఫ్లాపయింది. సురేష్‌బాబుని వదిలేసి దిల్‌ రాజు పేరు జత చేసినా కానీ ఈ ఆవిరి ఆడియన్స్‌కి పట్టలేదు.

తెలుగు చిత్రాలు ఫ్లాప్‌ అయిన టైమ్‌లో తమిళ చిత్రాలు సక్సెస్‌ బాట పట్టాయి. విజిల్‌ ఇక్కడ బ్రేక్‌ ఈవెన్‌ కాగా, ఖైదీ లాభాలు తెచ్చుకుంది.

ఈవారం శ్రీవిష్ణు సినిమా 'తిప్పరా మీసం'తో పాటు బూతు ప్రోమోలతో వైరల్‌ అయిన 'ఏడు చేపల కథ' కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.